Movies

నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి…. ఈ వార్తలో నిజం ఎంత?

కేవలం హీరోలుగానే కాకుండా మల్టీ టాలెంట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు మన యువహీరోలు. నటనతోపాటు వివిధ రంగాల్లో పట్టు సాధిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి హీరోలవుతున్నారు. ఇక నటన మీదే కాకుండా రచన ,దర్శకత్వం మీద కూడా దృష్టి పెట్టి అందులో కూడా రాణిస్తున్నారు. అందులో అవసరాల శ్రీనివాసరావు,అడవి శేషు వంటి వాళ్ళను ప్రధానంగా చెప్పుకోవాలి. కేరక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా వేస్తూ కూడా దర్శకత్వం మీద పట్టు పెంచుతున్నాడు.

ఇక స్టార్ హీరో లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నప్పటికీ డైరెక్షన్ అంటేనే ఇష్టమని చెబుతాడు. ఇటీవల వచ్చిన గూఢాచారి మూవీ జేమ్స్ బాండ్ మూవీలా ఉందని పలువురు క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు. అయితే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. పైగా పెళ్లాడబోయేది కూడా ఎవరో తెలిస్తే షాకవుతారు. అక్కినేని మనవరాలు,నాగార్జున మేనకోడలు అయిన యార్లగడ్డ సుప్రియను పెళ్లాడ బోతున్నాడట.

గూఢచారి మూవీలో ఓ కీలక పాత్ర పోషించిన సుప్రియతో అడవి శేషు ప్రేమలో పడ్డారట. సుప్రియ రెండు దశాబ్డల క్రితం అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి మూవీలో పవన్ కళ్యాణ్ తో జతకట్టింది. ఆతర్వాత సినిమాల్లో చేయలేదు కానీ అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూస్తోంది. గూఢచారితో కెమెరా ముందుకి నిలబడింది.

అసమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఇక ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పాటు హీరో సుమంత్ కూడా తన సోదరి ప్రేమకు ఒకే చెప్పాడట. వీరిద్దరి అనుబంధానికి అక్కినేని ఇంటి కోడలు సమంత ముఖ్య భూమిక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. నెలాఖరులో ఓ ముఖ్య విషయం చెబుతానంటూ అడవి శేషు ట్వీట్ చేసాడు.