Movies

చివరి వరకు కన్నీళ్ళతో నెట్టుకొచ్చిన టాప్ 10 ఐటెం గర్ల్స్

ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి,వినోదం పంచడానికి సినిమాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక చాలాకాలం నుంచి క్లబ్ డాన్స్ ల కోసం కొంతమందిని వినియోగించేవారు. కథలో ఓ భాగంగా క్లబ్ డాన్స్ సాంగ్స్ ఉండేవి. రాను రాను హీరోయిన్స్ కూడా ఇలాంటి తరహా నృత్యాలు చేస్తూ ఐటెం గర్ల్స్ గా నిలుస్తున్నారు. మొత్తం మీద సినిమా హిట్ అయిందంటే అందులో ఐటెం గర్ల్స్ పాత్ర కీలకంగా మారుతోంది. ఇక అప్పట్లో ఐటెం సాంగ్స్ తో జనాన్ని మత్తెక్కించిన వాళ్లలో జయమాలిని,జ్యోతిలక్ష్మి ఆతర్వాత అనూరాధ,సిల్క్ స్మిత,డిస్కోశాంతి,షకీలా ఇలా చాలామందే ఉన్నారు. అలాగే అభినయశ్రీ,ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు అయితే జనాన్ని ఉర్రూతలూగించారు.

గతంలో ఐటెం సాంగ్స్ లో వేసిన వారి జీవితాలు చివరిదాకా ఎలా సాగాయో చూస్తే అందులో జ్యోతిలక్ష్మి ని ముందుగా ప్రస్తావించాలి. గుడి ఎనక నా స్వామి గుర్రమెక్కి కూర్చుకున్నాడు అనే పాటతో తెలుగునాట అదరగొట్టేసింది. అయ్యవార్ల కుటుంబంలో 8మంది సంతానంలో ఒక అమ్మాయి అయిన ఈమె చెల్లి జయమాలిని. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో వెయ్యికి పైనే సినిమాలో నటించిన జ్యోతిలక్ష్మి కెమెరామెన్ సాయిప్రసాద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరికి జ్యోతిమీనా అనే కుమార్తె ఉంది. ఈమె కూడా కొన్ని పాటల్లో నటించింది. నాలుగు గదుల ఇరుకింట్లో గడిపిన జ్యోతిలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే,సినిమాల్లో నాకు వచ్చిందేమీ లేదు అనేది. ఇక జయమాలిని విషయం తీసుకుంటే,దాదాపు 600చిత్రాల్లో నటించి,ఫామిలీ ఫ్రెండ్ అయిన పార్తీబన్ ని లవ్ చేసి పెళ్లాడింది. చెన్నైలో సెటిల్ అయిన ఈమెకు ఓ కూతురుంది. తల్లి పలానా అని చెప్పుకోవడం తన కూతురు ఇబ్బంది పడేదని, అందుకే కూతురిని సినిమాలవైపు మళ్లించలేదని జయమాలిని చెప్పేది.

ఇక విజయలక్ష్మి అనే మహిళ సిల్క్ స్మితగా రూపాంతరం చెంది ఎన్నో సినిమాల్లో నటించి కోట్లు గడిచినప్పటికీ తినడానికి తిండి కూడా లేకుండా ఆరు రోజులు పస్తులుండి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లోకి రాకముందు ఉన్న పేదరికమే చివరి దశలోనూ వెంటాడింది. ఇక ఒంటరిగా చెన్నై వచ్చి ఒంటరిగానే తనువు చాలించింది. అనురాధ విషయం తీసుకుంటే ఆమెతో పాటు ఆమె కూతురు అభినయశ్రీ కూడా ఛాన్స్ లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీతో ఐటెం గర్ల్ గా టాప్ రేంజ్ అందుకున్న అల్ఫానా జీవితం పేదరికం కారణంగా రెండు కేసులు, మూడు పెళ్లిళ్లు గా నడిచింది. తెలుగు తమిళ భాషల్లో నటించినా , సరిపడా డబ్బుల్లేక చావు అంచులదాకా వెళ్లివచ్చింది. ఇక షకీలా ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో ,స్పెషల్ కేరక్టర్స్ లో నటించినప్పటికీ దుర్భర జీవితం సాగిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."