Womens Day

మహిళా దినోత్సవం మార్చి 8 న జరుపుకోవటానికి కారణం తెలుసా?

ప్రతి సంవత్సరం మార్చి 8 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతారు కాని ఇదే రోజున ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నా కాని ఒకప్పటి పరిస్తితులు వేరు. పురుషులతో సమానమైన పని చెసినా వారికి సరైన వేతనం వచ్చేది కాదు పురుషులతో సమానమైన వేతనాలు మరియు సమాన పని సమయం కోసం అమెరికా లోని పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో మొదటిసారిగా మహిళలు సమ్మే, ఆందోళనల బాట పట్టారు, చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమై అక్కడి మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కింది. అందుకే అప్పటి నుండి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు.

దేశం, జాతి, భాష, రాజ్యం, సాంసృతిక భేదభావాలకు తావు లేకుండా చాలా దేశాలలో మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ పార్శీ మహిళలు ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ప్రదర్శన జరిపారు. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ వారు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరిపారు. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవం నాడు తమ హక్కుల కొరకు లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.

దానితో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజుకు ప్రాముఖ్యత పెరిగి అన్ని దేశాలలో మహిళా దినోత్సవం జరపడం మొదలయ్యింది. 1977 లో ఐక్యరాజ్య సమితి మార్చి 8 న మహిళా దినోత్సవం గా అధికారికంగా ప్రకటించింది. మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ రోజు నిర్వహించుకుంటారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."