మనసు దోచిన గౌతమ్ మీనన్ హీరోయిన్స్….. ఒక లుక్ వేయండి
కొన్ని సినిమాలు మనకి నచ్చుతాయి .. మరికొన్ని సినిమాలు మన మనస్సును తాకుతాయి. అలా మనస్సును తాకే సినిమాలు తీయడంలో ఈయన స్పెషలిస్ట్. ప్రేమకథలను తెరకెక్కించడంలో ఒక్కో దర్శకునికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అది గౌతమ్ మీనన్ కు ఆ స్టైల్ కూసింత ఎక్కువగానే ఉంది. అది తను తీసిన సినిమాలను చుస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఎంచుకున్న జోనర్ ఏదైనా చివరికి అది ప్రేమకే దారితీస్తుంది గౌతమ్ మీనన్ సినిమా. ఈయన సినిమాలన్నింటిలో హీరోయిన్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తారు. ఎంతలా అంటే వారి పేర్ల కంటే అందులోని పాత్రపేరు గుర్తుండేంతలా.. మరి అలా ప్రేక్షకుల మనస్సులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న గౌతమ్ హీరోయిన్స్ లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం..
రీనా జోసఫ్ (చెలి) – రీమా సేన్

మేఘన (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్) – సమీరా రెడ్డి

మాయ (ఘర్షణ) – అసిన్

ప్రియ (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్)- దివ్య

జెస్సీ (ఏమాయ చేసావె) – సమంత

నిత్య (ఏటో వెళ్లిపోయింది మనసు) – సమంత

హిమానిక (ఎంతవాడు గాని) – త్రిష

చంద్రముఖి (ఎంతవాడు గాని) – అనుష్క


