Politics

లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయటానికి కారణం ఏమిటో తెలుసా?

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటి మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి నామినేట్ అయ్యాడు. తద్వారా మంత్రి అయ్యాడు. అయితే ఈసారి బరిలో దిగడం ఖాయమని తేలిపోయింది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

చివరకు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. విస్తృతంగా చర్చించిన అనంతరం లోకేష్ ను ఈ స్థానం నుంచి పోటీ చేయించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఇప్పటికే మంగళగిరి కేంద్రంగా ఐటి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి లోకేష్ కృషి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు,ఐటి పరిశ్రమలు మంగళగిరి రావడంలో లోకేష్ పాత్ర కీలకం.

కాగా వైసిపి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేయడం కూడా లోకేష్ కి లాభిస్తుందని అంటున్నారు. ఎందుకంటే టిడిపి సర్వేలో ఆళ్ళ కు తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందని కూడా అంటున్నారు. ఈమేరకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటున్నారు. ఆచితూచి వ్యహరించే చంద్రబాబు సరైన నిర్ణయమే తీసుకున్నారని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."