Politics

ఎన్నికల వేళ జగన్ ఇంట తీవ్ర విషాదం…షాక్ లో వైసీపీ నేతలు

మాజీమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని స్వగృహంలో ఈ రోజు తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత ఆయన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి కొనసాగుతూ వచ్చారు వివేకానందరెడ్డి. పలుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, మరికొన్ని సార్లు కడప ఎంపీగా వివేకానందరెడ్డి వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రమంత్రివర్గంలో చేరిన వివేకానందరెడ్డి… కొంతకాలం వ్యవసాయశాఖమంత్రిగా సేవలందించారు.

అనంతరం కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరిన వైఎస్ వివేకానందరెడ్డి డి కడప స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కొద్దిరోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటూ వైసీపీ వ్యవహారాలను చక్కబెడుతున్న వివేకానందరెడ్డి హఠాన్మరణం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."