Movies

టాలీవుడ్ మోస్ట్ లవింగ్ హీరోస్ కనుమరుగేనా…. ఇంకా చూడలేమా?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. స్టార్ హీరోగా ముద్ర పడ్డా కూడా వివిధ కారణాల వలన వెనుకబడిపోతారు. కొన్నాళ్ళకు తెరమరుగవుతారు. అలాంటి లవ్లీ హీరోస్ లో చాలామంది ఇప్పుడు లక్కుకోసం నానా పాట్లు పడుతున్నారు. అలాంటి వాళ్ళ లిస్టు పెద్దదిగానే ఉంది.

దివంగత డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ కొడుకు గా, హాస్య చిత్రాల రారాజుగా వెలుగొందిన అల్లరి నరేష్ ఇప్పుడు క్లిక్ కావడం లేదు. బుల్లితెరమీద జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ వచ్చేసాక పాపం ఇలాంటి నవ్వుల హీరో సినిమాలకు ఆదరణ కరువైపోయింది. చివరకు జబర్దస్త్ కంటెస్టెంట్స్ ఆది లాంటి వాళ్ళను పెట్టి మూవీస్ తీసిన అల్లరి నరేష్ దశ తిరగడం లేదు.

హీరో నవదీప్ పరిస్థితి చూస్తే, 2004లో కేరీర్ మొదలెట్టి ఈ 15ఏళ్ళలో హీరోగా చాలా సినిమాలు చేసాడు. కానీ బిగ్ హీరో కాలేకపోయాడు. గౌతమ్ ఎస్ ఎస్ సి ,చందమామ లాంటి రెండు మూడు హిట్స్ తప్ప పెద్దగా సినిమాల్లేవు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా తన హీరో కెరీర్ కి పూర్తిగా బ్రేక్ వేసిందని అంటున్నాడు. ఇక హీరోగా యాక్ట్ చేసిన రెండు మూడు మూవీస్ లకే పరిమితం అయ్యాయి.

ఇక లవర్ బాయ్ గా యువత హృదయాలను గెల్చుకున్న తరుణ్ పరిస్థితి కూడా అలానే ఉంది. బాలనటుడి నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణ్ పలు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. నువ్వే కావాలి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆర్తి అగర్వాల్ తో ప్రేమ విఫలం కావడం దగ్గర నుంచి ఇతగాడిని ఏ శక్తో వెనక్కి లాగేస్తోంది. తల్లి రోజారమణి సలహాలో, దురదృష్టమో ఏమో గానీ, గతంలో వరుస హిట్స్ చూసాక స్టార్ హీరోగా నిలబడిపోతాడనుకున్న తరుణ్ పరిస్థితి రివర్స్ అయింది. 2011నుంచి ఇతడి సినిమాలు పెద్దగా ఆడడం లేదు. రెండు మూడు సినిమాలు స్టార్ట్ అయ్యాక ఆగిపోయాయి. ఇక ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ కొనేవాళ్ళు లేని దుస్థితి ఎదుర్కొన్నాడు.

తనీష్ బాలనటుడిగా చేసి హీరోగా నచ్చావులే మూవీతో హిట్ కొట్టినా,కెరీర్ ముందుకు సాగలేదు. నక్షత్రం అనే మల్టీస్టారర్ లోనూ యాక్ట్ చేసినా లాభం లేదు. ఇక 5సినిమాలు పూర్తికాకుండా నిలిచిపోయాయి.

కాగా హ్యాపీడేస్ , కొత్త బంగారు లోకం వంటి మూవీస్ తో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ పరిస్థితిలో కూడా మార్పు లేదు. యంగ్ గా కనిపించినా డైనమిక్ గా రాణించలేదు. జి ఫర్ దోపిడీ యావరేజ్ అయింది. పాండవులు పాండవులు తుమ్మెదా మూవీతో మల్టీస్టారర్ గా రాణించినప్పటికీ లవకుశ భారీ డిజాస్టర్ తో ఉదయం ,ట్విస్ట్ వంటి మూవీస్ షూటింగ్ దశలోనే ఉంటె,మిస్టర్ 420వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదారు సినిమాలు ల్యాబ్ లోపడి ఉన్నాయి.

అలాగే ఆనంద్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజా సోలో హీరోగా తప్ప యాక్షన్ హీరో కాలేకపోయాడు. ఈమధ్య కనిపించకుండా పోయాడు. అయితే తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేయడం ఒకే అని చెబుతున్నా హీరో లెవెల్లో రెమ్యునరేషన్ ఇవ్వాలంటున్నాడట. దాంతో ఇతడి దగ్గరకు ఎవరూ వెళ్లడం లేదు. ఇక అక్కినేని కుటుంబం నుంచి నాగసుశీల కొడుకు సుశాంత్ హీరోగా వచ్చినా పెద్దగా రాణించలేదు. పైగా ఇతడి కారణంగా నాగసుశీల భారీగా నష్టపోయారు. పెద్ద స్టార్ కుటుంబం అయినా సరే వినియోగించుకోవడంలో ఘోరంగా దెబ్బతిన్నాడు.

కాగా వేంకటాద్రి హిట్ తో పర్వాలేదని అనిపించిన సందీప్ కిషన్, ఆతర్వాత హిట్ లేదు. అతడి మావయ్య చోటా కె నాయుడు కారణంగా నిర్మాతలు దొరుకుతున్నప్పటికీ హిట్స్ రావడం లేదు. ఇక తమిళ సినిమాలు చేస్తున్నా అక్కడ కూడా సక్సెస్ లేదు.