Movies

పోసాని కృష్ణమురళి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…. కొడుకులు ఏమి చేస్తున్నారో తెలుసా?

లవ్ యు రాజా అనే డైలాగ్ ఇన్నామంటే వెంటనే పోసాని కృష్ణమురళి గుర్తొస్తారు. సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత డైరెక్టర్ గా వినూత్న శైలిని కనబరిచిన పోసాని కృష్ణ మురళి నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. 1958జనవరి 1న గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో జన్మించాడు. తండ్రి సుబ్బారావు చిన్న ఉద్యోగం చేసేవారు. తల్లి శేషమ్మ గృహిణి. అక్క రాజ్యలక్ష్మి, చెల్లి ప్రమీల,అమర్ బోసాల్ అనే తమ్ముడు ఉన్నారు. డిఫెరెంట్ గా ఆలోచించే పోసాని కృష్ణమురళి వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. పోసాని పెద్దల సమక్షంలో కుసుమ లతను వివాహమాడారు. వీరికి ఉజ్వల్,ప్రజ్వల్ అనే ఇద్దరు కొడుకులున్నారు. తండ్రి ఆర్ధిక ఇబ్బందులు పడినా సరే తమకు చదువు చెప్పించారని పోసాని చెబుతారు. సొంత గ్రామంలోనే బికాం డిగ్రీ పూర్తిచేశారు. గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయంలో తెలుగులో పిజి పూర్తిచేశారు.

పిజి పూర్తయ్యాక హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్ లో ఏడాది పాటు ఉద్యోగం చేసి, మానేసి ఇంటికి వెళ్లిపోయారు. అదేసమయంలో తండ్రి మరణంతో కుటుంబ భారం మీద పడడంతో బతుకు తెరువు కోసం చెన్నై వచ్చిన పోసాని అక్కడ బండారు భాస్కరరావు అనే మిత్రుడి దగ్గర ఉండేవారు. ఇక గౌరీ మల్లేశం అనే మిత్రుని పరిచయంతో సినిమాల్లో రైటర్ గా చేరాలని నిర్ణయించుకుని సత్యానంద్ ని కలిస్తే ఖాళీ లేకపోవడంతో పరుచూరి గోపాలకృష్ణ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. ఎం ఫిల్ లో పట్టభద్రులైన పోసాని పిహెచ్ డి చేద్దామని అనుకున్నా రైటర్ గా ఖాళీ లేకపోవడంతో పూర్తిచేయలేదు.

దాదాపు 50చిత్రాలకు అసిస్టెంట్ రైటర్ గా చేసాడు. 1500జీతంతో పనిచేస్తూ అక్కడ మానేసాడు ఇక 1992లో ధర్మక్షేత్రం మూవీలో చిన్న పాత్రలో నటించారు. పోలీస్ బ్రదర్స్ సినిమాకు కథ,మాటలు అందించిన పోసాని హిట్ అందుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా కోసం డైలాగ్స్ రాసి సూపర్ హిట్ అందుకున్నాడు. రక్షణ,అల్లుడా మజాకా చిత్రాలకు కథ, మాటలు,స్క్రీన్ ప్లే అందించారు.పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం రా,గోకులం లో సీత, రవన్న,మాస్టర్ మూవీలకు కథ,డైలాగ్స్ అందించారు.

ఇక హీరో శ్రీహరి తో తీసిన ఎవడ్రా రౌడీ మూవీకి రచన, స్క్రీన్ ప్లే అందించిన పోసాని, ఇందులో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆతర్వాత వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించారు. అలాగే మహేష్ తో బాబీ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తమ్ముడు,రాఘవేంద్ర,సింహాచలం,భద్రాద్రి, సీతయ్య, టైగర్ హరిచంద్ర ప్రసాద్, వంటి మూవీస్ కి కథ,స్క్రీన్ ప్లే చేసారు. ఇక డైరెక్షన్ రంగంలో అడుగుపెట్టి, యుపి సినిమా లైన్స్ బ్యానర్ పెట్టి,2005లో శ్రావణ మాసం మూవీ దాదాపు 60మంది నటీనటులతో తీశారు.

ఈసినిమా ఆడకపోవడంతో ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. శ్రీకాంత్ తో తీసిన ఆపరేషన్ దుర్యోధన బడ్జెట్ కంటే పదిరెట్లు ఎక్కువ వసూళ్లు చేసింది. ఆతర్వాత ఆపద మొక్కుల వాడు,మెంటల్ కృష్ణ,రాజావారి చేపల చెర్వు,పోసాని జెంటిల్ మెన్ మూవీస్ డైరెక్షన్ చేస్తూ నటించారు. అయితే ఈ సినిమాలు దెబ్బతినడంతో ఆర్ధికంగా దెబ్బతిన్నారు. దీంతో నటించడం మొదలు పెట్టి దాదాపు 130సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. రాజకీయ రంగంలో కూడా తన అభిప్రాయాలు వెల్లడించే పోసాని ప్రజారాజ్యంలో చేరి చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేసారు.

2009లో చిలకలూరి పేట అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే ఇటీవల కాలంలో వైస్సార్ పార్టీ అధినేత జగన్ చేసిన పాదయాత్రను అభినందించారు. ఆపార్టీలో చేరకపోయినా 2019లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా పోసాని ఇద్దరు కొడుకుల్లో ఒకరు స్టడీస్ లో ఉంటె, మరొకరు ఫిలిం మేకింగ్ నేర్చుకుంటున్నారు.