Politics

నాగబాబుకి ఆస్తులు,అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసా?

ఆరెంజ్ సినిమా ఆర్ధికంగా బాగా నష్టం రావటంతో నాగబాబు ఆరెంజ్ సినిమా తర్వాత నిర్మాణానికి పూర్తిగా దూరమయ్యారు. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో పాటు. పలు టీవీ షోల్లో యాక్ట్ చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరించడం నాగబాబుకు బాగా కలిసొచ్చింది.

ఈ ప్రోగ్రామ్‌లు సక్సెస్ కావడంతో నాగబాబు ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నారు. తాజాగా నరసాపురం నుంచి జనసేన పార్టీ తరుపున లోక్‌సభకు పోటీ చేస్తుండటంతో నాగబాబు ఎన్నికల అధికారులకు తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో అందించారు. ఈ ప్రమాణ పత్రంలో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు. ఇందులో వాహనాలు వంటి చరాస్థులు రూ.36.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్థుల విషయానికొస్తే రూ.4.22 కోట్లుగా చూపించారు. దీంతో పాటు రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి తెలియపరిచారు.ఇప్పటి వరకు సినిమా, టీవీ రంగాల్లో సత్తా చూపెట్టిన నాగబాబు ఇపుడు రాజకీయ రంగంలో సత్తా చూపెడుతాడా లేదా అనేది చూడాలి.