Movies

లెక్చరర్ స్థాయి నుంచి హాస్య బ్రహ్మ స్థాయికి చేరుకున్న బ్రహ్మనందం జీవితంలో నమ్మలేని నిజాలు

తెరమీద కనిపిస్తే చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. తను కామెడీ చేయనవసరం లేదు .. డైలాగ్స్ చెప్పనవసరం లేదు.. కేవలం తన బట్టతల చూస్తే చాలు ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. అంతలా నవ్వుల పువ్వులు పూయిస్తూ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపుగా 1000 కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కిన హాస్య నటుడు బ్రహ్మానందం అని వేరే చెప్పక్కర్లేదు. 1956, ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా చాగంటివారి పాలెంలో జన్మించిన ఆయన పూర్తిపేరు కన్నెగంటి బ్రహ్మానందం. బ్రహ్మీగా పాపులర్ అయ్యారు మరి అలాంటి స్థాయికి చేరుకోవడానికి బ్రహ్మి కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు సాహిత్యంలో ఎం ఏ పట్టా పొంది 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశారు.

తొలి వేషం ఫిబ్రవరి 1 వ తేదీన ‘శ్రీ తాతావతారం’ సినిమాకి ముఖాన రంగు వేసుకున్నప్పటికీ, మొదటిగా జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అహ నా పెళ్ళంట’ సినిమా విడుదలయ్యింది. ఆ చిత్రంలో అరగుండు పాత్రకి వచ్చిన ప్రేక్షకాదరణ, వరుసగా చిరంజీవి సినిమాలైన ‘పసివాడి ప్రాణం’, ‘చంటబ్బాయ్’ సినిమాలలో నటించే ఛాన్స్ దక్కింది. రోజుకి 20 గంటలు పనిచేసి, సంవత్సరానికి 35 సినిమాలు చేసిన ఘనత బ్రహ్మీది.ఈ ముప్పై ఏళ్ళ సినీ కెరీర్ లో బ్రహ్మి, పూర్తిగా ఒక సంవత్సరం మాత్రమే ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేశారట.

బ్రహ్మానందం తను నటించిన సినిమాలను అసలు చూడడట. చూసినవాళ్లు తన పాత్ర గురించి చెప్తే విని సంతోషిస్తాడట. ఈ హాస్యనటుడిలో నటుడుతో పాటుగా పెయింటర్ దాగి ఉన్నాడట. మట్టితో బొమ్మలు చేయడంలో ప్రావీణ్యత ఉంది. దానితో పాటుగా సాహిత్యం, రచనలపై మంచి పట్టు ఉంది. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తులు జంధ్యాల, రామానాయుడు, చిరంజీవి అని ఈ ముగ్గురు గురించి బ్రహ్మి ఎప్పుడూ చెబుతుంటారు.

పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా… పోతావ్‌రా రేయ్… నాశనమై పోతావ్ (అహ నా పెళ్ళంట), నీ వెంకమ్మ (చిత్రం భళారే విచిత్రం), రకరకాలుగా ఉంది మాస్టారు (నువ్వు నాకు నచ్చావ్), ఖాన్ తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయి… (మనీ మనీ)
పండగ చేస్కో (పోకిరి), నా పెర్ఫార్మెన్స్ మీకు నచినట్లైతే ఎస్సెమ్మెస్ చేయండి (దూకుడు), నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు (ఢీ), బొమ్మరిల్లు ఫాదర్ ఇక్కడ (బృందావనం), కంటెంట్ ఉన్నోళ్లకి కటౌట్ చాలు (గబ్బర్ సింగ్), ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ.. (అనగనగా ఒక రోజు)ఇలా బ్రహ్మి నోట పలికిన డైలాగులు పేలాయి.

కాగా బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కూడా నటుడే. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమా ద్వారా సినీ అరంగేట్రం చేశాడు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. 2010 లో గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కిన బ్రహ్మి, అల్లు రామలింగయ్య తరువాత పద్మశ్రీ అందుకున్న రెండో హాస్యనటుడు. హాస్యనటుడిగా ఇప్పటివరకు 5 నంది అవార్డ్స్, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్, 6 సినీ మా అవార్డ్స్, 3 సైమా అవార్డ్స్ ను అందుకున్నారు.‘