Movies

పవన్ కళ్యాణ్ ఇంట్లో నుండి పారిపోతే మెగా ఫ్యామిలీ ఏమి చేసిందో తెలుసా?

అందరూ ఒకలా ఉండరు. అన్నీ ఒకేలా జరగవు. అంతెందుకు ఒక ఇంట్లోనే అందరూ ఒకలా ఉండలేరు. ఇక తెలుగు ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఫ్యామిలీలో ఇబ్బందులు తప్పలేదు. స్టార్ హీరోగా నిమిషం కూడా ఖాళీ లేని సమయంలో కూడా ఇంట్లో తమ్ముడి గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కిపోయేవారట. అవును నాగబాబు, పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు కదా. ఇందులో పవన్ కళ్యాణ్ చిన్నప్పటినుంచి తీరు వేరు. పేరెంట్స్ ది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు,నరసాపురం బ్యాక్ గ్రౌండ్ అయినప్పటికీ, తండ్రి ఉద్యోగం రీత్యా, పవన్ కళ్యాణ్ నెల్లూరు తో ఎక్కువ అనుభందం ఉంది. అక్కడ కాలేజీలో ఇంటర్ చదవడానికి చేరినప్పటికీ చదువు ఎక్కలేదు.

ఆధ్యాత్మిక భావజాలంతో పాటు ఎక్కువ పుస్తకాలు చదవడం,ఏదో ఒకటి సాధించాలన్న తపన, శోధన పవన్ లో ఎక్కువగా ఉండేవి. గజిబిజి లెక్కలకన్నా అసలు లెక్కేదో తేల్చాలని అనుకునేవాడట. ఈ వయసులో ఫిజిక్స్ ,కెమిస్ట్రీ వంటి బరువైన అంశాలు అవసరమా అని వాదించేవాడట. అలా మార్షల్ ఆర్ట్స్ లోకి మనసు మళ్లించారట. సరిగ్గా అప్పుడే తన పేరును కళ్యాణ్ బాబు అని ఉంటే పవన్ కళ్యాణ్ గా మార్చేసుకున్నాడు. ఇక ఏ రంగం వైపు అడుగులు వేయాలనే దానిపై ఆలోచించి , బౌద్ధం దిశగా ఆలోచనలు మొదలు పెట్టాడు.

అసలే మూడీస్ట్ . ఓ వైపు బడా నిర్మాతలు చిరంజీవి కోసం ఇంటిముందు క్యూ కట్టి సినిమాలకోసం వేచి చూస్తుంటే కనీసం వచ్చినవాళ్ళను పలకరించకుండా తన పనేదో తానే చేసుకుంటూ పవన్ మూడీగా ఉండేవాడట. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోనని భావించి, మెల్లిగా సినిమాలవైపు మళ్లించాలని చిరంజీవి ప్రయత్నాలు మొదలుపెట్టాడట.
Pawan kalyan,katti mahesh
అయితే తమ్ముడికి తగ్గ కథ దొరకక పోవడంతో బాగా ఆలస్యం అయిపొయింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి బౌద్ధం వైపు అడుగులు వేయడానికి బెంగళూరు వెళ్ళిపోయాడట. దీంతో చిరంజీవి కంగారుపడిపోయి పవన్ ఎక్కడ ఉన్నాడో వెతికించి ఇంటికి తీసుకొచ్చి ఎక్కడికీ కదలకుండా నాగబాబుని కాపలా పెట్టాడట. మొత్తం మీద జంధ్యాల శిష్యుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఓ సినిమా పవన్ తో చేసేలా సెట్ చేసారు.

ఆవిధంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ తీశారు. అలా తొలిచిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పవన్ తక్కువకాలంలోనే అనూహ్యంగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తన సత్తా చాటుతూ వచ్చాడు. అయితే చాలామంది హీరోలకు తొలిసినిమా మధుర స్మృతులను మిగిలిస్తే పవన్ కి మాత్రం మొదటి సినిమా తలిస్తే చాలు ఎక్కడలేని కోపంతో ఊగిపోతాడట. ఎందుకంటే, ఆ సినిమా ముందు జరిగిన తతంగం అంతా గుర్తుకు వస్తుందట.