Devotional

ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా?

తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. దీని వల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తుంటాయి.

ఉగాది నాడు ముఖ్యమైంది పంచాంగ శ్రవణం. దీన్ని ఉగాది రోజే ఎందుకు నిర్వహిస్తారంటే తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు.

అలాగే పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతామనేది పెద్దల నమ్మకం. ఉగాది నాడు పంచాగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యత ప్రసాదిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.

ఇక పంచాంగ శ్రవణంలోని పంచ అంగాలైన, తిథి సంపదను, వారం ఆయుష్షును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణను, కరణం గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. అంతే కాకుండా ఆ ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతుంది? పంటలు పరిస్థితేంటి? ఏరువాక ఎలా సాగుతుంది? అనే విషయాలను రైతులు తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."