Politics

ఎన్నికల ప్రచారం లో షర్మిల ఉంగరం ఎలా పోయిందో తెలిస్తే షాకవుతారు…. ఉంగరం విలువ ఎంతో తెలుసా?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. రోడ్డు షోలు,బహిరంగ సభలు,ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక విమర్శలు కూడా హద్దుమీరుతున్నాయి. వ్యక్తిగత విమర్శల జోరు పెరిగింది. ఇక అభ్యర్థులు పాదయాత్రగా పార్టీ శ్రేణులతో కల్సి ఇంటింటికి తిరుగుతూ,ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏ వీధిలో చూసినా, ఏ గ్రామంలో చూసినా అభ్యర్థుల ప్రచారాలు, మైకుల హోరు కనిపిస్తోంది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, జగన్ సిస్టర్ షర్మిలకుగుంటూరు జిల్లా మంగళ గిరిలో ఎన్నికల ప్రచారం బస్సు యాత్రతో ప్రారంభించారు.

ఇక దొంగలకు కూడా ఎన్నికల ప్రచారం బాగా కలిసి వస్తోంది. ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ కి కేటుగాళ్లు దండవేసే నెపంతో మెడలో చైన్ కొట్టేసారు. ఎన్నికల ప్రచారంలో పాల్ కి దండలు వేయడం,తీయడంలో బంగారం గొలుసుగా కనిపించిందే తప్ప తాను బంగారు గొలుసు వేసుకోలేదని అన్నారు పాల్ గారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే, అయితే ఇలాంటి వింత అనుభవం ఎదురవడంతో వైసిపి నేతలు షాకయ్యారు. మంగళగిరిలో పాదయాత్ర చేస్తూ,జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగాక బస్సు యాత్రకు షర్మిల శ్రీకారం చుట్టారు. అదేసమయంలో కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ బస్సుని అనుసరించారు.

షర్మిలకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కార్యకర్తలు ప్రయత్నించడంతో ఆమె బస్సులో నుంచి చేయి ముందుకు చాచారు. ఇక ఇదే అదనుగా ఓ వ్యక్తి షర్మిల చేతికున్న ఉంగరాన్ని కొట్టేసే ప్రయత్నం చేసాడు. షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని లాగేసి ప్రయత్నం చేయడంతో, ఖంగుతిన్న షర్మిల వెంటనే అప్రమత్తమై తనచేతిని వెనక్కి లాగేసుకుంది. ఉంగరం బిగుతుగా ఉండడంతో ఆ దొంగ చేతికి చిక్కలేదు.

ఈ దృశ్యం మొబైల్ లో రికార్డ్ అవ్వడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఉంగరం విలువ 10లక్షల విలువ ఉంటుందని తెలియడంతో పోలీసులు కూడా షాకయ్యారు. వీడియో ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. స్థానిక వ్యక్తేనని తేల్చారు.