Movies

పెళ్లయిన హీరోలను చేసుకుని కష్టాలు తెచ్చుకున్నతెలుగు హీరోయిన్స్

అలనాటి సావిత్రి నుంచి ఎందరో స్టార్ హీరోయిన్స్ పెళ్లయిన హీరోలను కట్టుకుని నానా కష్టాలు పడ్డారు. ఎవరి జీవితాన్నిఎవరు మళ్లించగలరు? అప్పటికే పెళ్లయి,పిల్లలున్న జెమిని గణేశన్ ని ప్రేమించి పెళ్లాడింది. తనకు పెళ్లి అయినప్పటికీ ప్రేమలేదని, ఇదే అసలైన ప్రేమ పెళ్ళని జెమిని అనడంతో సావిత్రి నమ్మేసింది. అయితే మధ్యలోనే వీళ్ళ కాపురం మోడువారింది. అతడి రాసలీలలను భరించలేక చిర్రెత్తిపోయి తన లైఫ్ ని కూడా ట్రాక్ తప్పేలా చేసుకుంది.

ఇక అమ్మచెప్పింది విని చేసుకుంటూ వచ్చిన శ్రీదేవి తల్లి మరణంతో పెళ్లయిన వాడిన రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తల్లికి ఆపరేషన్ అవ్వడం,ఆమె చనిపోవడం, అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో పరిచయమైన బోనీకపూర్ చేదోడు వాదోడుగా ఉంటూ బాగా దగ్గరయ్యాడు. నిజానికి అప్పటికే పూర్తిగా దివాళా తీసిన కపూర్ కి శ్రీదేవి ఓ కొండలా కన్పించింది. అందుకే ముందు పెళ్లయిన ఆమెతో విడాకులిచ్చి మరీ శ్రీదేవిని తెలివిగా పెళ్లాడాడు.

చివరకు భర్త కారణంగా నెలకు పాతిక లక్షల రూపాయల వడ్డీలు కట్టాల్సిన దుస్థితిలోకి వచ్చేసింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టేసారు. ఓ వైపు భర్త, మరోవైపు ఇద్దరు ఆడపిల్లలు ఇలా తన జీవితం మధ్యలో నలిగిపోయేలా చేసుకుంది. డబ్బుకోసం ఇబ్బంది కూడా పడిపోయింది. అందుకే బాహుబలిలో శివగామి పాత్ర వస్తే, ఇంతడబ్బు ఇస్తేనే చేస్తా అంటూ కండీషన్ పెట్టింది. ఇక దుబాయ్ లో ఓ పెళ్లివేడుకలో ఆమె మరణించడంతో బీమా సొమ్ము కారణం అంటూ  వార్తలు వచ్చాయి. ఆవిధంగా అతిలోక సుందరి అనేక బాధలతో అంతర్ధానం అయింది.

నటి, దర్శకురాలు విజయనిర్మల విషయానికి వస్తే,భర్త సూపర్ స్టార్ కృష్ణ తొలిభార్యతో కల్సి తిరిగినా సరే ఈమె క్షమించేంతగా ప్రేమ పంచింది. నిజానికి విజయ నిర్మలను పెళ్లాడాక మొదటి భార్యతో మరో బిడ్డను కృష్ణ కన్నప్పటికీ విజయనిర్మల ఎలాంటి ఇబ్బందులు రాకుండా నెట్టుకొచ్చింది. 

ఇక స్నేహం కోసం సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కల్సి నటించిన నటుడు విజయకుమార్ కి పెళ్లయి పిల్లలున్నారు.అలాంటి వ్యక్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన మంజుల తో ముగ్గురు ఆడపిల్లలను కన్నాడు.

అలనాటి టాప్ హీరోయిన్ రాధిక అంటే తెలియనివారుండరు. ఈమెకు శరత్ కుమార్ మూడవ భర్త. అతడికి ఈమె రెండవ భార్య. అంతకుముందు రాధికా ఓ విదేశీ వ్యక్తిని పెళ్ళాడి పిల్లల్ని కంది. ఇక రాధికతో పెళ్ళికి ముందే శరత్ కి వరలక్ష్మి అనే కూతురుంది.

కాగా కమల్ హాసన్, సారిక లకు శృతి హాసన్,అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా , నటి గౌతమీ అతడితో డేటింగ్ చేసింది. ఇక భరత్ భాగ్య అనే భర్త ఉన్నా సరే, కమల్ తో సహజీవనానికి గౌతమి సిద్ధపడింది.

ఇక పవన్ కళ్యాణ్ ని బద్రీ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లాడింది. ఒక కొడుకు ,కూతురు పుట్ట్టాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పవన్ మరో పెళ్లి చేసుకోగా, ఆమె కూడా రెండో పెళ్ళికి సిద్ధం అవుతోంది.