ఈ నలుగురుకి ఎలాంటి సంబంధం లేకున్నా కామన్ పాయింట్ ఒకటుంది…ఏమిటో తెలుసా?
కొందరికి ఎలాంటి బంధుత్వం ఉండదు. అసలు ఒకప్రాంతం వారు కూడా కాదు. కానీ వాళ్ళ మధ్య ఎదో కామన్ పాయింట్ ఉంటుంది. ఐశ్వర్యారాయ్, అనుష్క శెట్టి,సుమన్, ప్రకాష్ రాజ్ ఈ నలుగురు సౌత్ లో పేరున్న నటులు అని అందరికీ తెలుసు. ఇక వీరికి ఓ కామన్ పాయింట్ ఒకటుంది. సుమన్ తమిళ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. టాలీవుడ్ తో ఎక్కువ అనుబంధం కూడా ఉంది. నిజానికి 1959ఆగస్టు 28న మంగుళూరులో పుట్టాడు. ఆంగ్లంలో లిటరేచర్ పూర్తిచేసి తుళు భాష తెల్సిన నటుడు. తరంగిణి,నేటి భారతం వంటి సినిమాల కన్నా సితార మూవీతో తెలుగుకి బాగా కనెక్ట్ అయ్యాడు.

ఓ పేద కళాకారుడిగా సుమన్, రాజభవన్ లో రాకుమారిగా భానుప్రియ చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది.సుమన్ అప్పట్లో తెలుగులో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. కొన్ని కారణాల వలన వెనుకబడిపోయి,వెంకటేశ్వర, రామ వంటి ఆధ్యాత్మిక పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్లాడు.

ఇక ప్రస్తుతం సైలెన్స్ అనే మూవీలో చేస్తోన్న అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. 1981నవంబర్ 7న మంగుళూరులో పుట్టింది. యోగ టీచర్ గా స్థిరపడాలనుకుంటే,పూరి జగన్నాధ్ కంట్లో పడి సూపర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. విక్రమార్కుడు,లక్ష్యం,అరుంధతి వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది. ఇక బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చేసుకుంది.

ఇక ఐశ్వర్యా రాయ్ 1973నవంబర్ 1న మంగుళూరులోనే పుట్టింది. విశ్వసుందరిగా గెలిచి,ఆతర్వాత సినీ రంగంలోకి అడుగుగుపెట్టి, సంచలనం క్రియేట్ చేసింది. జీన్స్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి సుపరిచితం. ఇక దక్షిణాది నుంచి బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. బిగ్ బి అమితాబ్ కి కోడలుగా అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడింది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇలా ఈ నలుగురు సెలబ్రిటీలు మంగుళూరు వాసులు కావడం నిజంగా విశేషమే.

ఎన్నో విభిన్న పాత్రలతో సత్తా చాటుతున్న ప్రకాష్ రాజ్ 1965మార్చి మంగుళూరులో పుట్టాడు. ఇతడి తల్లి హుబ్లీ లోని ఓ అనాధ ఆశ్రమంలో పెరిగిన క్రిస్టియన్. నర్సింగ్ చేస్తూ మంగుళూరు వచ్చింది. తండ్రి వ్యవసాయం చేస్తూ మంగుళూరు పారిపోయి వచ్చేసారట. ఇక ఆమెకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. హీరోయిన్ ఫాదర్ గా ఎందరో హీరోలకు మామగా నటించాడు. నెగెటివ్ రోల్స్ తో కూడా తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు.

