తెలుగు వారే కానీ తెలుగులో రాయడం,చదవడం రాని మన హీరోలు
రంగస్థలం మీద గానీ, సినిమాల్లో గానీ నటించాలంటే,వాచకం,ఆహార్యం అన్నీ ఉండాలి. అందం లేకున్నా అభినయం ఉండాలి. ఇక అప్పట్లో మన నటీనటులు తెలుగు భాషకు ఎంతో రాణింపు తీసుకొచ్చారు.ఎన్టీఆర్,అక్కినేని,సావిత్రి,భానుమతి,ఎస్వీఆర్,తరువాత వచ్చిన కృష్ణ,శోభన్ బాబు ఇలా అందరూ తెలుగు దనానికి వన్నెతెచ్చారు. భానుమతి కవయిత్రి, సంగీతం తెల్సిన మంచి గాయని కూడా. తన పాటను తానె రాసుకుని,తానే సంగీతం సమకూర్చి, తానె పాడేది. ఇక ఎన్టీఆర్ తానే రాసి, తానే డైరెక్షన్ చేయడం,పలు పాత్రలను అందునా పౌరాణిక పాత్రలను ఆ కాలంలో పోషించి ఎన్టీఆర్ మెప్పించారు.

కానీ అదంతా గతం అంటున్నట్లు తెలుగు పరిశ్రమ ఉంది. హీరోయిన్స్ ని ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటుంటే,వీళ్లకు డబ్బింగ్ ఆధారం అయింది. అంతవరకూ పర్వాలేదు. కానీ అచ్చమైన తెలుగు వారై ఉండి కూడా తెలుగు రాయడం,చదవడం రాకపోతే ఊహించగలమా? కానీ అదే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో నెలకొంది. కేవలం కొద్దిమంది మాత్రమే తెలుగు రాయడం,చదవడం చేస్తున్నారట. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తెలుగు సరిగ్గా పలుకలేడు. ఇప్పుడిప్పుడే అ ఆ ఇ ఈ లు గుర్తుపడుతున్నాడట. క గుణింతం వచ్చేసరికి కెరీర్ చివరకు వచ్చేస్తుందేమో అంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ బాబుకి తెలుగులో ఒక్క అక్షరం కూడా రాదు. ఇప్పుడు చెప్పండ్రా వాట్ టు డు వాట్ టు డు అనే పెద్ద పెద్ద డైలాగులు తెరమీద పలికించే మహేష్ బాబు అదంతా ఇంగ్లీషులో రాసుకుని మాట్లాడతాడట. ఇతడి భార్య నమ్రత పొరుగు రాష్ట్రంలో పుట్టి పెరిగిన కారణంగా తెలుగు భాష రాలేదంటే పర్వాలేదు కానీ, సూపర్ స్టార్ కృష్ణ కడుపున పుట్టిన మహేష్ కి తెలుగు రాదంటే ఎంత అవమానం. కనీసం ఇప్పుడైనా ఎవరో ఒకరు పుణ్యం కట్టుకుని తెలుగు నేర్పిస్తారేమో చూడాలి.

తాత అక్కినేని,నాన్న నాగార్జున తెలుగు భాషను బాగా పలకడంలో దిట్ట గా నిలిచారు. అయితే అఖిల్ ఏదో ఇంటా బయట మాట్లాడ్డం వలన తెలుగు నేర్చేసుకున్నాడు కానీ, ఎంత డైలాగైనా సరే ఇంగ్లీషులో రాసుకుని చెప్పాల్సిందే.

ఇక అలనాటి తెలుగు అగ్ర హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగొంది,సహజనటిగా పేరొందిన జయసుధకు తెలుగు అక్షరం ముక్క రాదు. వయస్సులో ఉన్నప్పుడు డైలాగులు గుర్తుపెట్టుకుని చెప్పేసే జయసుధ,ఇప్పుడు వయస్సు మీద పడడంతో పదేపదే అడిగి తెలుసుకోవాల్సి వస్తోందట.

ఇక 500మూవీస్ లో నటించి , డైలాగ్ కింగ్ గా పేరొందిన మోహన్ బాబు కడుపున పుట్టిన మంచు లక్ష్మి మాట్లాడే భాష చూస్తే,మంచు లాంగ్వేజ్ అంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుని తెంగ్లీషుగా మార్చేసిన ఘనత ఈమెది. ఆశ ఎక్కువే గానీ తెలుగు నేర్చుకోడానికి బద్దకంతో భాషను ఖూనీ చేసేస్తోంది.

ఇక మంచు విష్ణు కూడా తన పేరు రాసుకోలేడు,స్పష్టంగా పలుకలేడు. మోహన్ బాబు కొడుకు అని చెప్పుకోడానికి సిగ్గుచేటు. ఇక మంచు మనోజ్ కూడా తండ్రి పోలిక తెచ్చుకోలేదు.

