Movies

విక్రమ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా….తండ్రి కూడా స్టార్ హీరోనే

హీరో చియాన్ విక్రమ్ అనగానే విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అని గుర్తొస్తుంది. ఏ నటుడైనా పోషించడానికి వెనకడుగు వేసే పాత్రలను విక్రమ్ ఏ మాత్రం సంశయం లేకుండా నటించి మెప్పిస్తాడు. అనుకున్న స్థాయికి మించి కష్టపడి ఆ పాత్రకి జీవం పోస్తాడు. అలాంటి నటుడు గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయి. 1966 జూన్ 17న తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి గ్రామంలో జన్మించిన విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నడీ, ఇతనిని బాగా ఇస్టపడేవాళ్లు ఇతన్ని కెన్నీ అని పిలుస్తారట. చెన్నైలోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి బీఏ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకొని ఎంబీఏ కూడా అక్కడే పూర్తిచేసాడు.విక్రమ్ తండ్రి వినోద్ రాజ్ కూడా నటుడే!

ఆయన పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. అంతేకాదు, నృత్యరంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. తండ్రి నుండి నటన వారసత్వంగా పుణికి పుచ్చుకొని విక్రమ్ తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. విక్రమ్ చిన్న వయసు నుండే నటనపై ఎనలేని ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో నాటకాల్లో కూడా నటించాడు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడట.ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.చియాన్ విక్రమ్ కరాటే, ఈత పోటీల్లో ఎన్నో బహుమతులు అందుకున్నాడు. గిటార్, పియానో కూడా బాగా వాయిస్తాడట.

1992 సంవత్సరంలో శైలజ బాలకృష్ణన్ ను విక్రమ్ పెళ్లి చేసుకోగా, ధృవ్, అక్షిత అనే ఇద్దరు పిల్లలు కలిగారు. 1990 లో విక్రమ్ తన కెరీర్ ని మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్ కడల్ కమ్మని అనే చిత్రంలో హీరోగా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టిన విక్రమ్ కెరీర్ మొదట్లో తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో నటించిన ‘చిరునవ్వుల వరమిస్తావా’ అనే సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు.దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “అక్క పెత్తనం చెల్లెలి కాపురం” సినిమాలో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో విక్రమ్ నటించాడు. బంగారు కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప మరిచిపోలేని అనుభూతి గా విక్రమ్ చెప్పి మురిసిపోతుంటాడు.

విక్రమ్ కి బైక్ పై లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టమట. విక్రమ్ 1990 నుండి 1998 వరకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. అయితే అవి అంతగా విక్రమ్ కు గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. కానీ 1999 లో వచ్చిన సేతు సినిమా విక్రమ్ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ, ఇంకొక్కడు లాంటి సినిమాలు ఒక మాములు విక్రమ్ ను చియాన్ విక్రమ్ గా భారత చలన చిత్ర పరిశ్రమలో నిలబెట్టాయి. సేతు, శివపుత్రుడు సినిమాలలోని నటనకు గాను చియాన్ విక్రమ్ కు రెండు నేషనల్ అవార్డ్స్, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు.