Movies

టాలీవుడ్ లో పద్దతిగా నటించి గాసిప్స్ లేని హీరోయిన్స్

హీరో హీరోయిన్స్ పై గాసిప్స్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక మరింతగా వైరల్ అయిపోతున్నాయి. అయితే వీటిని కొందరు పట్టించుకుంటే, మరికొందరు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని పోతుంటారు. ఇక కొంతమంది తారల విషయం చూస్తే,అసలు గాసిప్స్ రానేరావు. అలాంటి వాళ్ళను పరిశీలిస్తే, సుమలత అందానికి అందం,అభినయానికి అభినయం పుష్కలంగా ఉన్నాయి. అన్ని భాషల్లోనూ నటించిన ఈమె గ్లామర్ పాత్రల వైపు అంతగా వెళ్ళలేదు. పైగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్ ని పెళ్ళిచేసుకుని సెటిల్ అయింది. ఈమె గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఇక మళయాళీ అయిన సుజాత నటించే సమయానికి ఇద్దరు పిల్లల తల్లి. బతికుండగా, పోయాక కూడా నటన పరంగా గుర్తింపు సాధించుకున్న సుజాతపై ఎలాంటి పుకార్లు లేవు. నటి గౌతమి తెలుగు అమ్మాయే.

సినిమా పరంగాగాని,వ్యక్తిగత జీవితంలో గానీ ఎప్పుడూ పుకార్లను ఎదుర్కోలేదు. వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నప్పటికీ సినిమాల్లో ఉన్నంతకాలం ఆమెపై గాసిప్స్ రాలేదు. ఇక నటి ఊహ విషయం తీసుకుంటే,హీరోయిన్ గా ఉండగానే, హీరో శ్రీకాంత్ ని పెళ్ళాడి,ముచ్చట ముగ్గురు పిల్లల్ని కని,భార్యగా, తల్లిగా సంతోషంగా ఉంది. ఈమె మీద కూడా ఎలాంటి గాసిప్స్ లేనేలేవు. రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తూ ప్రేమలో పడి,అతడితో సహజీవనం చేసి,పెళ్ళాడి ఇద్దరు పిల్లల తల్లి కూడా అయింది. అయితే బేధాభిప్రాయాలతో విడిపోయిన తర్వాత రెండో పెళ్ళికి కూడా సిద్ధపడుతోంది. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ హుందాగా ఉంటున్న ఈమె పై ఎలాంటి గాసిప్స్ లేవు. వరుసగా రెండేళ్లు ఉత్తమ నటిగా రాష్ట్రప్రభుత్వ అవార్డు అందుకున్న నటి లయ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఓ డాక్టర్ ని పెళ్ళిచేసికుని ఫారిన్ లో సెటిల్ అయింది.

ఆమె  గురించి ఎలాంటి గాసిప్స్ లేవు. మైనే ప్యార్ కియా సినిమాతో దేశం మొత్తం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టిన భాగ్యశ్రీ వరుస ఆఫర్లతో ఆకాశమంత క్రేజ్ ని అందుకున్న ఈమె చక్కగా నచ్చిన వరుడిని పెళ్ళాడి సెటిల్ అయింది. పెళ్లయ్యాక భర్తతో కల్సి ఓ సినిమా చేసింది. ఈమె గురించి కూడా పుకార్లు లేవు. కమర్షియల్ గా ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్  రోల్స్ కూడా చేస్తోంది. యోగా గురువు భరత్ ఠాకూర్ ని పెళ్ళాడి, సెటిల్ అయిన భూమిక గురించి ఒక్క రూమర్ లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కు బోల్డన్ని ఛాన్స్ లు వచ్చినా పెద్దగా నటించకుండా, పెళ్లి చేసుకుని మంచి ఇల్లాలిగా ,ఇద్దరు పిల్లల తల్లిగా మంచి పేరు తెచ్చుకుంటోంది. వంశీ సినిమాలో మహేష్ తో నటించిన సమయంలో ప్రేమలోపడి పెళ్లాడిన ఈమెపై ఒక్క గాసిప్ కూడా లేదు. నమ్రత పెళ్లి తర్వాత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి,వ్యాపార రంగంలో కూడా బానే రాణిస్తోంది.