అమ్మకు రెండో పెళ్లి సాయి ధరమ్ తేజ్ ఎందుకు ఒకే చేసాడో తెలుసా?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జీవితంలో చాలామందికి తెలీని ఓ కుటుంబ సమస్య ఉంది. దానికి పరిష్కారం కూడా అతడే కనుగొన్నాడు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ విషయం వెల్లడించాడు. వివరాల్లోకి వెళ్తే , ‘ సీనియర్ నటుడు నరేష్ అబ్బాయి నవీన్ తో సాయి ధరమ్ తేజ్ తో ఎప్పటినుంచి ఫ్రెండ్ షిప్ ఉంది. చిన్నప్పుడు ఒకే వీధిలో ఉండేవారట. ఇక రామ్ చరణ్ కి కూడా నవీన్ తో అనుబంధం ఉండేది. చెర్రీ కోసం చిరంజీవి ఇంటికి వచ్చే నవీన్ ని కల్సి ఫ్రెండ్ షిప్ చేసే ఛాన్స్ వచ్చింది’ అని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. కాగా 15ఏళ్ళక్రితం అమ్మానాన్న విడిపోయారు. దీంతో తల్లి అన్నీ తానై పెంచారట. అమ్మా నాన్న మధ్య తేడాలు రావడంతో ఇద్దరూ విడిపోయారని, వారి నిర్ణయాన్ని తాను,తమ్ముడు గౌరవించమని తేజ్ చెప్పాడు.

తేజ్ 10వ తరగతిలో ఉండగా జరిగిందట. అయితే తండ్రితో టచ్ లోనే ఉంటున్నాడట తేజ్. అన్నీ మరిచిపోయి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడట. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కానందున కెరీర్ కి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వరట. నాన్న లోటు తెలియకుండా నన్ను,తమ్ముడిని మా అమ్మ పెంచిందని,అయితే అమ్మ 2011లో మరోవ్యక్తిని పెళ్లాడిందని తేజ్ చెప్పాడు. ‘మాకు పెళ్లిళ్లు అయ్యి వెళ్ళిపోతే అమ్మకు తోడు ఎవరూ ఉండరు. ఇలాంటి సమయంలో ఓ తోడు అవసరమని భావించాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయం కూడా కావడంతో అమ్మకు రెండో పెళ్లిని గౌరవించాలని అందరూ అనుకున్నాం. ఇక సవతి తండ్రితో కూడా మా బంధం బానే ఉంది. ఆయన కంటికి సంబంధించిన ఓ డాక్టర్. మాతో చాలా కంఫర్ట్ గా ఉంటారు. కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు’ అని తేజ్ చెప్పాడు.

