Politics

నిజంగా జగన్ కి రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉందా…. అభివృద్ధి చేయగలడా?

ఏప్రియల్ 11న ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 23వరకూ ఫలితాల కోసం వేచి ఉందని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికల సందర్బంగా ప్రచారంలో వాడీ వేడీ ప్రచారం సాగింది. అందులో ప్రధానంగా జగన్ అధికారంలోకి వస్తే, వీధికో రౌడీ తయారవుతాడని,అభివృద్ధి ఆగిపోతుందని,పోలవరం,అమరావతి ప్రగతి ముందుకు సాగదని, అరాచకం ప్రబలిపోతుందని, అయినా పాలన సాగించాలంటే సీనియార్టీ లేదని ఇలా రకరకాల విమర్శలను అధికార టిడిపి నేతలు గుప్పించారు. అంతేకాదు పెట్టుబడులు రావని, వచ్చినవి కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆరోపణలు చేసారు. అయితే జగన్ కి అధికారం వస్తే,ఇబ్బందులను తప్పించగలడా,అభివృద్ధి సజావుగా చేస్తాడా వంటి అంశాలపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ఎక్కువగా ఈ విమర్శలను ప్రస్తావించారు. 

ఎవెరెన్ని అనుకున్నా ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేసారు. ఈవీఎం లలో నిక్షిప్తం అయిపొయింది. ఫ్యాన్ గుర్తుకి ఎక్కువమంది ఓట్లు వేశారని ఫాన్ గాలి బలంగా వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. నిజంగా జగన్ సీఎం అయితే ఏపీకి ఎలాంటి దశ పడుతుంది?,రాష్ట్రానికి ఒక రూపు వస్తుందా, ప్రత్యేక హోదా తెస్తాడా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణా నుంచి వస్తున్న జలవివాదాలు,పోలవరం ప్రాజెక్ట్,అమరావతి ,పెట్టుబడులు ఇలా అన్నింటినీ సమర్ధవంతంగా చక్కబెట్టి ఓర్పు నేర్పు ఉన్నాయా వంటి వాటి గురించి చర్చ నడుస్తోంది. నిజానికి జగన్ వ్యూహాలను చంద్రబాబు కాపీ కొట్టారు. కేంద్రంపై అవిశ్వాసం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ వరకూ ఇంకా నవరత్నాలలో కొన్ని అంశాలను కాపీ కొట్టారని చెప్పాలి.

ఒకవేళ కాపీకొట్టడం కాకున్నా ఫాలో అయ్యారని చెప్పాలి. దీనికి తోడు జగన్ యువకుడు కావడం వలన అభివృద్ధితో పాటు కొన్ని అంశాల్లో ప్రజలకు ఆశలున్నాయి. దూకుడుగా వ్యవహరించే జగన్ ఖచ్చితంగా అభివృద్ధి చేయగలడని ప్రజలు విశ్వసించారని అంటున్నారు. ఒక్క ఛాన్స్ అనే అంశం తో పాటు జగన్ నిబద్ధత కూడా జనంలో పాజిటివ్ తీసుకొచ్చిందని అంటున్నారు. ఈ అంశాలే జగన్ ని తిరుగులేని నేతగా నిలబెట్టబోతున్నాయని అంటున్నారు. చూద్దాం మే23నాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.