Movies

జెర్సీ సినిమాని ఎంత మంది నిర్మాతలు రిజెక్ట్ చేసారో తెలుసా?

రెండు ప్లాప్ లతో వర్రీగా ఉన్న నేచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఘనత టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి దక్కుతుంది. జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా.. తెలుగుతో పాటు ఓవర్సీస్‌లోనూ మిలియన్ డాలర్లను కురిపిస్తోంది. ‘నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. పైగా నాకు రాయడం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ నుండి రాయడం అలవాటు చేసుకున్నా. అలాగని కవితలు, నవలలు రాసేవాడిని కాదు. నా చుట్టు జరుగుతున్న సంఘటనలను పేపర్‌పై రాసేవాడిని. అయితే 2015 వరకూ నాకు డైరెక్టర్ అవుతాననే నాకు తెలియదు. అయితే ‘జెర్సీ’ సినిమా కథను చాలా మంది నిర్మాతలకు వినిపించా. సుమారు 15 మంది నిర్మాతలు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు’అని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గౌతమ్ తెలిపారు.’

ప్రతి స్క్రిప్ట్ ఒక గుడ్ స్క్రిప్ట్ అనిపిస్తుంది. మూవీ ప్రాసెస్‌లో స్క్రిప్ట్‌ నుండి స్క్రీన్‌ మీదికి వెళ్లడం అనేది లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఒక్కో టెక్నికల్ టీం స్క్రిప్ట్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళ్తుంది. స్క్రిప్ట్ స్టేజ్‌లో సినిమాపై ఒక అంచనాకు రావడం అనేది చిన్న విషయం కాదు. నిర్మాతలు ఇదే ఆలోచిస్తారు’ అని గౌతమ్ తిన్ననూరి చెప్పాడు ‘నా స్నేహితుడు ఒకరు సినిమా తీశారు. దానికి డైలాగ్స్, స్క్రిప్ట్ రాసేవాడిని. అప్పుడే టెక్నికల్ వర్క్ తెలుసుకున్నా. అప్పుడే నా దగ్గర ఉన్న స్టోరీలను మార్చుకున్నా. నేను కాన్ఫిడెంట్‌గా కథ చెప్పలేను. ఎంత మంచి కథ అయినా చెప్పడం రాకపోతే ఆ కథ వేస్ట్ అయినట్లే కదా’అని పేర్కొన్నాడు.

 ‘మొదట్లో నేనూ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశా. నా స్నేహితుడు గిరీష్‌ని కూర్చోబెట్టి కథ చెప్పడం నేర్చుకున్నా.నాకు రాయడం కన్నా నెరేట్ చేయడం కష్టం అయ్యేది. అలా కథ చెప్పడం మొదలుపెట్టా. ఇక ‘జెర్సీ’ కథ విషయానికి వస్తే.. ‘మళ్లీ రావా’ చిత్రం తరువాత జెర్సీ కథను రాయడానికి చాలా టైం పట్టింది. ఆ కథను చాలా మంది నిర్మాతలకు వినిపించా. అయితే చాలా మంది రిజెక్ట్ చేశారు. అయితే వాళ్లపై రివేంజ్ అన్నట్టు ఏం కాదు. అయితే ఒక్కో నిర్మాతకు ఒక్కో టేస్ట్ ఉంటుంది. మనం చెప్పిన కథ దానికి సూట్ కానప్పుడు కలిసి వర్క్ చేయలేం కూడా. ఈ సందర్భంలో ఒక్కోసారి వాళ్లు చెప్పిందే నిజం కావచ్చు’అని డైరెక్టర్ తిన్ననూరి తన స్టైల్ లో చెప్పాడు.