Politics

జగన్ స్విట్జ ర్లాండ్ వెళ్లి రిలాక్స్ వెనక కూడా పెద్ద స్టోరీ… డోంట్ మిస్

ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తంచేశారు. గెలుపు తమదంటే తమదని టిడిపి వైసిపి చెప్పుకొచ్చాయి. అయితే మే23వ తేదీన కౌంటింగ్ లో అసలు విజేత ఎవరో తేలనుంది. ఈలోగా అధికార టిడిపి జిల్లాల వారీగా సమీక్షలతో మునిగి తేలుతోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన సమీక్షలను స్టార్ట్ చేసారు. పోలింగ్ సరళి ఎలా ఉంది, గెలుపు ఓటములు ఇలా ఉండబోతున్నాయి,గెలుపు ఎక్కడ ఎక్కడ అనువుగా ఉంది వంటి విషయాలపై టిడిపి,జనసేన పార్టీలు తమ స్థాయిల్లో సమీక్షలు చేసుకుంటూ లెక్కలను మరింత పదునెక్కిస్తున్నారు.అయితే వైసిపి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గెలుపు తమదేనని చెప్పిన జగన్ ప్రస్తుతం స్విట్జ ర్లాండ్ టూర్ లో ఉన్నారు.

అయితే సమీక్షలు జరిపేసి అనంతరం ఆయన పర్యటనకు వెళ్లారట. దీనికి తోడు చాలా సర్వేలు జగన్ అధికారంలోకి  రావడం ఖాయమని తేల్చేశాయి. నియోజక వర్గాల వారీగా పోలింగ్ సరళి,ఎవరికెన్ని ఓట్లు వస్తాయి వంటి లెక్కలు తేల్చాక, సర్వేలతో పోల్చి చూసుకుని 120సీట్లు దాటి వస్తాయన్న అంచనాలు వచ్చారట. అయినా, ఎవరు నెగ్గుతారో తెలియకుండా ధీమాగా ఇలా టూర్ ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమన్న ధీమా రావడం,ప్రజలు పక్కాగా వైసిపిని గెలిపించబోతున్నారని లెక్కలు పక్కాగా వేసుకున్నాకే జగన్ ఇలా టూర్ వెళ్లాడని అంటున్నారు.పసుపు కుంకుమ ఎఫెక్ట్ లేదని కూడా వైసిపి అంటోంది.

అన్నదాత సుఖీభవ స్కిం వైపు కూడా రైతులు పెద్దగా మొగ్గు చూపలేదని వైసిపి వర్గాలు అంటున్నాయి. గ్రామీణ ఓటర్లే కాదు పట్టణ ఓటర్లు కూడా తమకు అనుకూలంగా ఉన్నారన్న అంచనాకు వైసిపి నేతలు వచ్చారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గణనీయంగా సీట్లు పెరుగుతాయని వైసిపి భావిస్తోంది. కనీసం 120సీట్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని అంటున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమా జగన్ లో పుష్కలంగా ఉండబట్టే రిలాక్స్ అవ్వడానికి ఫారిన్ వెళ్లారని అంటున్నారు. ముఖ్యంగా పెరిగిన పోలింగ్ సరళి,అర్ధరాత్రి దాకా ఓటు వేయడం ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతికరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అర్ధం అవుతోందని వైసిపి నేతలు అంటున్నారు.