Movies

‘కాంచన 3’ తెలుగు బిజినెస్‌ ఎంత చేసింది.. ఎంత రాబడుతుందో తెలిస్తే షాక్ అవుతారు

కొందరు దర్శకులు హిట్స్ మీద హిట్స్ ఇస్తుంటారు. అదే రీతిలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ముని చిత్రం మంచి విజయాన్ని నమోదుచేయడంతో అప్పటి నుండి తెలుగు, తమిళంలో ముని సిరీస్‌లో హర్రర్‌ సినిమాలను దర్శకుడు తీస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ‘కాంచన 3’ చిత్రాన్ని తాజాగా తెరకెక్కించాడు. గతంలో వచ్చిన కాంచన చిత్రం భారీ విజయాన్ని అందుకున్నందున ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను దర్శకుడు లారెన్స్‌ తెరకెక్కించాడు.ఇక విడుదలైన రోజు ఈ చిత్రం గతంతో పోల్చితే కాస్త తగ్గిందనే టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్‌ ఎలా వస్తాయో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

‘కాంచన 3’కి పోటీ ఏమీ లేకపోవడంతో పాటు, తెలుగు రాష్ట్రాలు, తమిళ రాష్ట్రాల ప్రేక్షకులు హర్రర్‌ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను దక్కించుకుంది. మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్‌ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల డబ్బింగ్‌ రైట్స్‌ను కేవలం 10 కోట్లకు కొనుగోలు చేసిన నిర్మాత కు ఇప్పుడు లాభాల పంట పండిందన్న టాక్ వస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 10 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో ఈజీగా 20 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని చెబుతున్నారు.

అంటే నిర్మాతకు ఏకంగా 10 కోట్ల రూపాయల లాభంగా లెక్కలు చెబుతున్నారు. మొత్తానికి కాంచన సినిమా వల్ల లాస్‌ వస్తుందనుకున్న నిర్మాతకు ఏకంగా 10 కోట్ల రూపాయలు లాభం రావడం సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమా వల్ల జెర్సీకి దెబ్బ పడిందని, ఇక ఎవెంజర్స్‌ రాకతో కాంచన 3కి కూడా దెబ్బతగిలిందని అంటున్నారు. ఎవెంజర్స్‌ రాకుంటే మరో రెండు మూడు కోట్ల వరకు కాంచన 3కి వచ్చే ఛాన్స్ ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.