Politics

లోకేష్ ఫారెన్ ట్రిప్ కు అందుకే వెళ్లలేదా?

ఏపీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగడం,నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం,చివరకు పోలింగ్ పూర్తి కావడం తెల్సిందే. ఏప్రియల్ 11న పోలింగ్ ముగిస్తే,మే23న లెక్కింపు జరుగనుంది. లెక్కింపుకికి చాలా సమయం ఉండడడంతో సాధారణంగా పోలింగ్ అయిన తర్వాత రాజకీయ నేతలు తలా ఒక దేశానికి విహార యాత్రలకు వెళ్లిపోతుంటారు. ఈసారి కూడా అలా చాలామంది పొలిటీషియన్స్ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే కొందరు మాత్రమే ఇండియాలో అందునా ఏపీలో ఉండిపోయారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యి రెండో వారం పూర్తి కావొస్తోంది కూడా. ప్రధాన పార్టీ రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ స్విస్ పర్యటనకు వెళ్లినట్టు చెబుతున్నారు. కుటుంబంతో సహా జగన్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.

ఇక్కడి మండుటెండల్లో ప్రచార పర్వాన్ని సాగించిన నేపథ్యంలో జగన్ అక్కడ మంచుకొండల్లో సేదతీరుతున్నట్టు చెప్పవచ్చు. ఇక నారా ఫ్యామిలీ మాత్రం దేశం దాటకుండా హిమాలయాలకు విహారానికి వెళ్లింది. వాస్తవానికి ముందుగా నారా ఫ్యామిలీ కూడా విదేశాలకే వెళ్లే ప్లాన్ చేసిందట. అయితే జగన్ విదేశాలకు వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్లు నానా మాటలు అన్నారు. నల్లధనం దాచడానికి అంటూ చెప్పుకొచ్చారు.మరి జగన్ అలా విమర్శించి తాము మళ్లీ విదేశానికి వెళితే అప్పుడు బుక్ అవుతాం అని భావించి విదేశీ విహారాన్ని మానుకున్నట్టుగా తెలుస్తోంది.

పైగా నారా లోకేష్ అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లి విహరించే మూడ్లో లేరట. మంగళగిరి ఫలితమే అందుకు కారణమని అంటున్నారు. అక్కడ లోకేష్ కు ఏ రెండు శాతమో ఎడ్జ్ ఉందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సర్వేలు కూడా చెప్పాయట. అందుకే విహారాలకు వెళ్లే ఆలోచన చేయలేదట. పొలిటికల్ కెరీర్ టెన్షన్లో ఉండటంతో లోకేష్ విదేశీ విహారాన్ని క్యాన్సిల్ చేసుకుని.. ఈ ఎండల వేడిమి నుంచి బయట పడటానికి సిమ్లా తో సరిపెట్టేసాడని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."