మహర్షిలో ఆ ఐదు మైనస్‌లు కానున్నాయా..!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా మహర్షి మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ సారధ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అభిమానుల అంచనాలకు అనుగుణంగా మహేష్ కెరీర్లో నిలిచిపోయేలా దర్శకుడు పైడపల్లి వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మే 1న హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. అయితే ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలు తలెత్తాయంటూ ఫిల్మ్‌నగర్‌తోపాటు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఆ కథనాల విషయానికొస్తే, బ్రహ్మోత్సవం సినిమా తరువాత మహేష్‌బాబు పీవీపీ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అదే మహర్షి మూవీ.
ఇక మహర్షి మూవీకి సంబంధించి ఆ చిత్ర బృందం జ్యూక్ బాక్స్ విడుదల చేసింది. సినిమాలో సందర్భానుసారంగా ఆరు పాటలు పెట్టినా అవి సాటి సినీ ప్రేక్షకుడిని అంతగా మెప్పించలేకపోయాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా నువ్వే సమస్తం ఒక్క సాంగ్ మాత్రమే సాటి అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించగా, మిగిలిన ఐదు పాటలకు రొటీన్ ఫార్ములాలోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలను అందించాడని టాక్. మరి సినిమా విడుదలయ్యాక ఈ ఐదు పాటలను రివ్యూ ఎలా ఇస్తారో చూడాలి. అయితే మహర్షి డైరెక్టర్ వంశీ పైడపల్లి మాత్రం పీవీపీని కాదని దిల్‌రాజు వద్దకు వెళ్లడంతో వివాదానికి తెరలేచింది.ఫలితంగా ఆగ్రహంతో ఉన్న పీవీపీ కోర్టుకెక్కారు.
అయితే పీవీపీ – దిల్ రాజు – వంశీ పైడపల్లి మధ్య తలెత్తిన వివాదాన్ని సర్దుమణింగించేందుకు మహేష్‌బాబు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. దిల్‌రాజు, పీవీపీ మధ్య సయోధ్య కుదర్చడంలో మహేష్ సక్సెస్ అయ్యారు. తొలుత మహేష్‌బాబు మాట ఇచ్చినందున ఆ తరువాత మూడో ప్రొడ్యూసర్‌గా అశ్వనీదత్ వచ్చి చేరారు. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు కావడంతో మహర్షి మూవీ ఏ స్థాయిలో నిర్మితమవుతుందో ఊహించుకుంటుంటేనే ఓ రేంజ్లో ఉంటుంది.
ముగ్గురూ కలిసి మహర్షి మూవీ లెవల్స్‌ను పెంచేశారు.అంతా బానే ఉందనుకుంటే, డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనవేనంటూ దిల్ రాజు చిత్ర ప్రారంభానికి ముందు లెటర్ రాయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వనీదత్ చిత్రంలో భాగమైన తనకు కనీస ఆదాయం లేకుంటే ఎలా అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చి కృష్ణా హక్కులను ఇవ్వాలంటూ పట్టుబట్టారట. ఈ వివాదాన్ని సరిచేసేందుకు మహేష్‌బాబు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.ఇలా నిర్మాతల మధ్య తలెత్తుతున్న వివాదాలతో నిత్యం వార్తల్లోకెక్కుతున్న మహర్షి మూవీకి సంబంధించి మహేష్ ఫాన్స్ తోపాటు సగటు సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


