Movies

కొరటాలకు మెగాస్టార్ మరో షాక్ ఇచ్చారా…???

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా భారీ వ్యయంతో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమా కి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తరువాత చిరంజీవి కొరటాలశివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఆ చిత్రం అంత త్వరగా ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు.

ఎందుకంటే, సైరా సినిమా ఆలస్యం కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సైరా చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా ఆలస్యం చేస్తున్నాడని అంటున్నారు. అయితే కొరటాల తన కొత్త చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభించాలని ఎప్పటినుండో భావిస్తుంటే, ఇపుడు ఆ ఆశలు ఆవిరైపోయినట్లు టాక్ నడుస్తోంది. ఎందుకంటే సైరా చిత్రం షూటింగ్ పూర్తవడానికి మరో నెల రోజుల సమయం పట్టేస్తుందట.ఈ నేపథ్యంలో తమ సినిమా మరికొన్ని రోజులు ఆగిపోయేలా ఉందని శివ భావిస్తున్నాడు.

పోనీ ఆతరువాత అయినా ప్రారంభించాలనుకుంటే అదీ లేదట. సైరా కోసం చిరంజీవి బాగా లావు అయ్యారంట. మరి కొరటాల సినిమాలో చిరు బాగా సన్నగా కనిపించాల్సి ఉండటంతో వైట్ లాస్ థెరపీ కోసం మరొక 30-40 రోజులు కేటాయించబోతున్నారట. దీంతో కొరటాల శివ సినిమా సెట్స్ మీదికి వెళ్ళడానికి షాక్ మీద షాక్ తగులుతోంది.