యాక్టర్ కాకుంటే త్రిష ఏమయ్యేదో తెలుసా.!
నేను యాక్టర్ అవ్వకపోయి ఉంటే డాక్టర్ అయ్యేవాడ్ని,మరొకటి అయ్యేదాన్ని ఇలా స్టార్ హీరోస్,హీరోయిన్స్ చెప్పే మాటలు వింటుంటాం. అయితే టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌హీరోల సరసన హీరోయిన్‌గా నటించి, ఇప్పటికీ యాక్టింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న అందాల భామ త్రిష యాక్టర్ కాకుండా ఉండివుంటే, ఏమయ్యేదో తెలుసా? త్రిష కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. టాలీవుడ్‌లో చిరంజీవి మొదలుకొని, పలువురు యంగ్ హీరోల సరసన కూడా త్రిష నటించింది.
2015లో వరుణ్ అనే బిజినెస్ మేన్‌తో నిశ్చితార్ధం చేసుకున్న త్రిష తర్వాత సినిమాల్లో నటించదనుకున్నారంతా. కానీ, అదే కారణంతో త్రిష ఆ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంది. తనకి లైఫ్ పార్ట్ నర్ కావాలనుకున్న వ్యక్తి, తన కెరీర్‌కి అడ్డు తగులుతున్నాడని గ్రహించిన త్రిష మరో ఆలోచన చేయకుండా, నిశ్చితార్ధం రద్దు చేసుకుని, కెరీర్‌నే ప్రాణంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తమిళంలో నయనతార తర్వాతి స్థానం త్రిషదే అని అందరూ అంటుంటారు. ఓ పక్క హీరోయిన్‌గా, మరోపక్క హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తోనూ జోరుగా ఉంది.
హిందీలో అక్షయ్‌కుమార్‌తో ‘కట్టా మీటా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, తొలి సినిమాకే మంచి పేరు దక్కించుకుంది.
తెలుగులో త్రిష రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది. మంచి అవకాశం వస్తే, తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేయడానికి అందాల త్రిష రెడీగా ఉంది. అయితే తాజాగా 36వ పుట్టినరోజు చేసుకున్న సందర్బంగా ఈ భామ కొన్ని ఆశక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి . త్రిష హీరోయిన్ కాకుంటే, క్రిమినల్ సైకాలజిస్ట్ అయ్యేదట. అయితే విధి ఆమెను యాక్టింగ్ వైపు నడిపించిందట. ఫలితంగా యాక్టింగ్‌లో ఉన్నత శిఖరాలను అందుకునేలా చేసింది.

