Movies

పవన్‌కళ్యాణ్‌ సినిమాల సంగతేంటీ?

జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించాక, సినిమాలు చేయననీ, తన జీవితం ప్రజా జీవితానికే అంకితమని గతంలోనే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేసేసాడు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం అలా కోరుకోవడం లేదు. రాజకీయాలతో పాటు, సినిమాల్లో కూడా మరి కొంత కాలం పవన్‌ కళ్యాణ్‌ రాణించాలని బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు, మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇదే కోరుకున్నారు. రెండు పడవల ప్రయాణం పవన్‌కి పెద్ద కష్టమేమీ కాదని చిరు బహిరంగంగానే చెప్పేసాడు. ఇక జనసేన పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారట.ఇలాంటి కీలక సమయంలో సినిమా విషయమై పవన్‌తో డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.

తమ కాంబోలో సినిమాకి చర్చించేందుకే హరీష్‌, పవన్‌ కళ్యాణ్‌ని కలిశారనీ ప్రచారం జరిగింది. అయితే అది అబద్దమనీ, హరీష్‌ క్లారిటీ ఇచ్చేసాడు. కానీ పవన్‌ ఒప్పుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్‌ వదులుకోనని హరీష్‌ శంకర్‌ అనడం కొసమెరుపు. ఈ క్షణం పవన్‌ సినిమాకి సై అంటే బడ్జెట్‌కి వెనుకాడకుండా, సినిమా రూపొందించేందుకు ప్రముఖ నిర్మాత రామ్‌ తాళ్లూరితో సహా పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని టాక్. 

ఇన్ని రకాల ప్రపోజల్స్‌ ఉండడంతో ఎలక్షన్‌ రిజల్ట్స్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఫైనల్‌గా తన నిర్ణయాన్ని బయట పెడతాడో లేదో కానీ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం పార్టీకి అదనపు లాభం చేకూర్చుతుందని జనసేన నేతలు గట్టిగానే భావిస్తున్నారట. యూత్‌లో క్రేజ్‌ ఉన్న పవన్‌ కళ్యాణ్‌, సినిమాల్లో నటిస్తే, యూత్‌ మరింత యాక్టివ్‌ అవుతారనీ తద్వారా అది పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనీ వారు విశ్లేషిస్తున్నారట. పవన్‌కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్‌ కూడా ఇదే సలహా ఇచ్చినట్లు వినికిడి. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."