Movies

కృష్ణ అల్లుడు సుధీర్ బాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు

యంగ్ హీరో సుధీర్ బాబు పేరు ప్రేక్షకులకు సుపరిచితమే. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ లో స్టేబుల్ గా ముందుకు సాగుతున్న ఈ యువహీరో మే 11, 1977లో జన్మించాడు.  హీరో సుధీర్ బాబు గురించి ఆసక్తికర విషయాలేమిటో చూద్దాం. .సుధీర్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. పుల్లెల గోపీచంద్ తో డబుల్స్ పార్ట్నర్ గా కూడా బ్యాడ్మింటన్ ఆడాడు. ఇప్పుడు ఏకంగా పుల్లెల గోపీచంద్ మీద తెరకెక్కే బయోపిక్ లో మనోడే హీరో గా చేస్తున్నాడు. “ఏ మాయ చేసావే” చిత్రంలో జెస్సీ అన్నగా సుధీర్ బాబు తెరకు పరిచయమయ్యాడు. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఘట్టమనేని మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు.

అప్పట్లో, సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడన్న విషయం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ తరువాత హీరోగా మారిన తరువాత “ఏ మాయ చేశావే”లో నటించింది ఇతడేనని ప్రేక్షకులు ఆశ్చర్యపడ్డారు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శినిని వివాహమాడిన సుధీర్ బాబు ఏ మాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా, సింప్లిసిటీతోనే ముందుకు సాగుతున్నాడు. స్వంత టాలెంట్ తోనే కెరీర్ లో పైకి రావాలని తాపత్రయపడే మనస్తత్వం, స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నం చేసే సుధీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. 

ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి)తో హీరోగా మారాడు. ఈ చిత్రంతోనే బబ్లీ బ్యూటీ రెజీనా కూడా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత “ప్రేమకథా చిత్రం”తో ఇండస్ట్రీలో తనకంటూ గట్టి పునాదిని ఏర్పరచుకున్న సుధీర్ మొదటి సినిమాలో తన నటనలో లోపాలను తెలుసుకుని సరిదిద్దుకున్నాడు. నేర్చుకుంటూ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సుధీర్ బాబు నమ్ముతూ తన టాలెంట్ ను ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటున్నాడు. ప్రభాస్ “వర్షం” సినిమాని హిందీలో “భాగీ”గా రీమేక్ చేయగా, దాంతో బాలీవుడ్ కి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో గోపీచంద్ పోషించిన పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయి, బాలీవుడ్ లో కూడా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ఇందులో హీరో హీరోయిన్స్ గా నటించారు. స్టైలిష్ విలనిజాన్ని ప్రదర్శించి హీరోతో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సుధీర్ బాబుకు స్వంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఒకప్పుడు, ఇందులో తన డాన్స్ వీడియోస్ అలాగే యాక్టింగ్ రిహార్సల్స్ వన్నీ అప్లోడ్ చేసేవాడు. ప్రస్తుతం ఈ ఛానల్ అంత యాక్టివ్ గా లేదు. ఈ లింక్ లో (https://www.youtube.com/user/iSudheerbabu/videos) సుధీర్ బాబు కు సంబంధించిన వీడియోస్ చూడవచ్చు.సుధీర్ బాబు బైక్స్ స్టంట్స్ అలాగే జిమ్ కి సంబంధించిన విశేషాలను కూడా ఇందులో గమనించవచ్చు. ఇంకా సుధీర్ బాబు సినిమాలకు సంబంధించిన మేకింగ్ వీడియోస్ పై కూడా చూడొచ్చు. హీరోలు కూడా నిర్మాతలుగా సరికొత్త అవతారం ఎత్తుతున్న ఈ రోజుల్లో తమకు నచ్చిన కథలను ఏ అడ్డంకులు లేకుండా తెరకెక్కించుకునేందుకు సొంత ప్రొడక్షన్ హౌస్ ఉండాలని ఈ తరం హీరోలు ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు కూడా “సుధీర్ బాబు ప్రొడక్షన్స్” పేరిట సొంత బ్యానర్ ప్రారంభించి, ఇప్పటికే “నన్ను దోచుకుందువటే” సినిమా ద్వారా విజయం సాధించాడు. సుధీర్ బాబు త్వరలో నానితో మల్టీస్టారర్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక ఇటీవలే జరిగింది. ఈ చిత్రంలో అదితీ రావ్ హైదరీ, నివేతా థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంద్రగంటి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కాగా సుధీర్, ఇదివరకే ఇంద్రగంటి దర్శకత్వంలో “సమ్మోహనం” సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం మంచి క్లాస్ మూవీగా టాక్ తెచ్చుకుంది.