Healthhealth tips in telugu

చేతి, కాలి గోళ్ల ఫంగస్, గోరు చుట్టు ఇట్టే మాయం.. ఈ చిన్న చిట్కాతో!

Fungal Nail Infection : గోరు చుట్టు నొప్పి నిద్ర పట్టనివ్వడం లేదా? గోళ్ల ఫంగస్ వల్ల పాదాలు అందవిహీనంగా కనిపిస్తున్నాయా? హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని లేకుండా, మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టొచ్చో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి. మీ గోళ్లను మళ్లీ ఆరోగ్యంగా మార్చుకోండి!

సాదరణంగా మనలో చాలా మందికి చేతి,కాలి గోర్లపై ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
garlic
ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, 3 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి వేసి అవసరం అయితే నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయాలి.

ఈ విధంగా సమస్య తగ్గేవరకు చేయాలి. ఈ విధంగా చేయటం వలన చేతి,కాలి గోళ్లపై ఏర్పడిన ఫంగస్,గోరు చుట్టు,పుచ్చు గోళ్ళ సమస్య అన్నీ తొలగిపోతాయి. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు వాపు,నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."