Movies

కలెక్షన్ కింగ్ కి పోటీగా మెగాస్టార్ బిజినెస్

రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో రాజ‌కీయాల వైపు వెళ్లే సూచనలు కానరావడం లేదు. పైగా ఇకనుంచి పూర్తిగా త‌న దృష్టి మొత్తం సినిమాల‌పైనే అంటున్నాడు. మొత్తం మీద అచ్చిరాని పాలిటిక్స్ నుంచి పూర్తిగా బ‌య‌టికి వ‌చ్చేసి.. త‌న‌కు అచ్చొచ్చిన రంగంలోనే దూకుడు చూపిస్తున్నాడు. కేవ‌లం న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగానే కాకుండా బిజినెస్ మ్యాన్‌గా కూడా చాలానే అనుభ‌వం సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికే మా టీవీతో పాటు మ‌రికొన్ని బిజినెస్‌లు కూడా చేసాడు .చిరంజీవి స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసి, స‌చిన్‌తోనే ఔరా అనిపించుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈయ‌న చూపు మ‌రో బిజినెస్‌పై ప‌డింది. ఈ సారి మెగాస్టార్ విద్యారంగాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే కలెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు ఈ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేకత చాటుకున్నారు. శ్రీ విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌ల‌తో కుల మ‌తాల‌కు అతీతంగా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చాడు . ఇక ఇప్పుడు చిరు కూడా విద్యారంగం దృష్టి పెట్టడం విశేషం. ఇప్పుడు స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఒక‌టి ప్రారంభించ‌బోతున్నాడు.

దీని కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాడు. చిరు ఈ స్కూల్ మొద‌లు పెడుతున్న‌ట్లు సీఈఓ జె.శ్రీనివాసరావు అనౌన్స్ చేసారు. తాజాగా చిరంజీవి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్‌కు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి మోహన్ బాబుకి పోటీగా స్కూల్ నడిపగలరా లేదా అనేది చూడాలి.