Politics

కరుణానిధి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?నమ్మలేని నిజాలు

దేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళాల్లో తమిళనాడు పగ్గాలు చేపట్టి తమిళుల బ్రతుకులు మార్చిన నేత. ఎన్నో సంక్షేమ పథకాలు అంతకు మించి జనరంజక పాలన. అందుకే తమిళులకు కరుణానిధి దైవ సమానం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి దేశమంతా సుపరిచితమే.అయన గురించి ఎవరికీ తెలియని నిజాలను తెలుసుకుందాం. 

1. పద్నాలుగేళ్ల పసి ప్రాయంలోనే రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు కరుణానిధి. 
2. ఓటమెరుగని రాజకీయ ప్రస్థానం కరుణానిధిది. పోటీచేసిన ప్రతిసారి గెలిచిన నేత. ఒక్కసారి కూడా కూడా ఓడిపోని నేతగా పేరుంది.
3. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి.
4. తమిళనాడు ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మొదటి సినిమా “పరాశక్తి” రచయిత కరుణానిధి. ఈ సినిమా ద్వారా శివాజీ గణేశన్ కు అద్భుత తెరంగేట్రం అందించాడు కరుణానిధి.
5. కరుణానిధి రచించిన ఎన్నో చైతన్యపూరిత రచనలు నిషేధించబడ్డాయి. ప్రభుత్వాలను, సమాజాన్ని అంతలా ప్రభావితం చేసేవి కరుణానిధి రచనలు.
6. శివాజీ మరియు ఎంజీఆర్ లకు ఎన్నో గొప్ప సినిమాలను అందించిన గొప్ప రచయిత కరుణానిధి.
7. తమిళనాడు ఉద్యమ సంస్థ ఎల్.టి.టి.ఇ సానుభూతిపరునిగా కరుణానిధికి పేరుంది.
8. తమిళంలో విడుదలయిన “ఇరువర్” సినిమా కరుణానిధి మరియు ఎంజీఆర్ ల స్నేహం ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. ఈ సినిమా చుస్తే వీరి స్నేహం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించగా ఎంజీఆర్ పాత్రలో మలయాళీ నటుడు మోహన్ లాల్ నటించాడు.
9. తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడు కరుణానిధి.
10. 1950 లో వచ్చిన “మంతిరి కుమారి” అనే సినిమాతో ఎంజీఆర్ దశ మారింది. ఆ సినిమా రచించింది కూడా కరుణానిధినే. వీరి స్నేహం అలా బలపడింది.
11. పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో మురసోలీ అనే వార్త పత్రికను తిరువరూర్ నుండి ఆగష్టు 10, 1942 లో ప్రారంభించాడు. ఇదే అనతి కాలంలో డీఎంకే పార్టీ అధికార పత్రికగా రూపాంతరం చెందింది.
12. కరుణానిధి నాస్తికుడు. ఒకసారి రామసేతు మీద విమర్శలు చేసి వార్తల్లోకెక్కారు.