Movies

బిత్తిరి సత్తి లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది

వార్తలు ఇలా కూడా చదవచ్చని బిత్తిరి సత్తి వినూత్నంగా వార్తలు చదువుతూ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అందుకే అంతలా అతడు జనంతో మమేకమయ్యాడు. సినిమాల్లో బ్రహ్మానందం ని చూడగానే చాలామందికి నవ్వొస్తుంది. రాత్రి 9న్నర అయితే చాలు కేసీఆర్ అన్న సార్,జగనన్న సార్ అంటూ చదివే వార్తలను నవ్వుతూ వీక్షించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నువ్వు పనికిరావని అన్నవాళ్ళే ఇప్పుడు ఆశ్చర్య పోతున్నారు. బిత్తిరి సత్తి లగ్జరీ లైఫ్ చూసి షాకవుతున్నారు. కావలి రవి అనే బిత్తిరి సత్తిని,చేవెళ్ల రవి అని కూడా పిలుస్తారు. యితడు ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది. 1979ఏప్రియల్ 5న కావలి నరసింహ , యాదమ్మ దంపతులకు చేవెళ్ల మండలం పామెల్లలో జన్మించిన సత్తి కి ఓ అక్క ఉంది. 

తండ్రి నరసింహ ఆ ఊళ్ళో కావలి గా ఉంటూ అప్పుడప్పుడు యక్ష గానాలు చేసేవాడు. దాంతో సినిమాల్లో నటించాలనే ఆసక్తి చిన్నప్పటినుంచి బిత్తిరి సత్తిలో ఉండేది. ఊళ్ళో ఐదవ తరగతి వరకూ,చేవెళ్లలో ఇంటర్ వరకూ చదివాడు. ఎవరింటికి వెళ్లినా అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు. నాటకరంగంలో శిక్షణ పొందిన సత్తి ఎన్నో నాటకాల్లో నటించాడు. సినిమాల్లో చేరడానికి హైదరాబాద్ వచ్చిన సత్తి, జబర్దస్త్ ఫేమ్ కొమరం తో కల్సి కృష్ణ నగర్ రూమ్ లో ఉండేవాడు. అందరినీ కల్సి సినీ ఛాన్స్ లు అడుగుతూ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర మేనేజర్ గా పనిచేసాడు. ‘నల్లగా ఉన్నావ్, నీ మాటలు సినిమాలకు సరిపోవు,నీకు సినిమా వేశాలేంటి ఇలా పలువురు అవమానించారట. 

ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా సభ్యత్వం తీసుకుని 2005నుంచి 15ఏళ్లపాటు 150సినిమాలకు పైనే డబ్బింగ్ చెప్పాడు. ఇక సినిమా ఛాన్స్ లు రావని తెల్సి సొంతూరు వెళ్లి అరటి తోట వేసి వ్యవసాయం చేస్తూనే, అప్పుడప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టుల మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేవాడు. ఇక అదే సమయంలో వి6 ఛానల్ లో మనపూరి తాతయ్య ప్రోగ్రాం కూడా చేసేవాడు. ఇక జర్నలిస్టుగా శిక్షణ తీసుకుని పలు చానల్స్ లో పనిచేసి,వి6 ఛానల్ లో తీన్ మార్ కార్యక్రమంతో విజయాన్ని అందుకున్నాడు.

డ్రెస్ కోడ్ కూడా ఎంచుకుని తీన్ మార్ వార్తలను చదవడంతో టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. సీమ శాస్త్రి మూవీలో చిన్నపాత్రతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి రుద్రమదేవి మూవీలో సామంతరాజు పాత్ర వేసాడు. పేపర్ బాయ్, నేనేరాజు నేనే మంత్రి,గౌతమ్ నందన్ వంటి సినిమాల్లో నటించాడు. పలు ఈవెంట్స్ కూడా చేస్తూ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయినా సరే,వి6ఛానల్ వదలకుండా మిగిలిన పనులు చేస్తానని అంటున్నాడు. నెలకు లక్షలు సంపాదిస్తున్న సత్తికి భార్య ఓ కుమారుడు ఉన్నారు. హైదరాబాద్ ఫిలిం సిటీలోని కాస్టలీ ఇల్లు చూస్తే దిమ్మతిరుగుద్ది.