Sports

క్రికెట్ మ్యాచ్ ఆగితే ఎన్ని రూ.కోట్ల నష్టమో తెలుసా!

క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ మ్యా్చ్‌లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. టీమ్‌లతో పనిలేకుండా ప్రతి మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. అయితే వీరి సంతోషానికి మధ్యమధ్యలో వర్షం ఆటంకాన్ని కలిగిస్తోంది. 

వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతే క్రికెట్ అభిమానులు ఎంతగా నిరాశ చెందుతారో.. కంపెనీలు కూడా దీనికన్నా ఎక్కువగానే బాధపడతాయి. అదేంటి మ్యాచ్ ఆగిపోతే కంపెనీలకు వచ్చిన నష్టమేంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. 

స్టార్ ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులను రూ.వేల కోట్లు వెచ్చించి ఐసీసీ నుంచి కొనుగోలు చేసింది. అలాంటిది వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే ఈ కంపెనీ భారీగా నష్టపోతుంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవలసి ఉంటుంది. 

స్టార్ ఇండియా ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంది. అందుకే ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు ఉంది. దీంతో ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చే అవకాశముంది. ఇకపోతే ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ ఇందులో ఒకటి.