Movies

అల్లు అర్జున్ కొత్త కారవాన్ ఖరీదు ఎంతో తెలిస్తే మతిపోతుంది

అవును, తన స్టైల్ కి తగ్గట్టు అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ ని ప్లాన్ చేసుకుని పక్కాగా అమలు చేస్తాడు. ఇప్పుడు అత్యాధునిక వసతులతో ఓ కార్వాన్ తయారుచేయించుకున్నాడు. మూడు కోట్లు వెచ్చించి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకున్నాడు. దీంతో దీని ధర ఏడుకోట్ల పైనే ఉంటుందని టాక్. 

దేశంలోని ఏ హీరో కూడా వాడని లగ్జరీ కారుని బన్నీ వాడుతున్నాడు. అందుకే ఈ కారు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్,టాలీవుడ్ లో మహేష్ బాబు తర్వాత స్టైలిష్ కార్వాన్ వాడేది బన్నీయే. అయితే ఆధునికంగా రూపొందించిన ఈ కార్వాన్ ని ఏవిధంగా అందిరికీ చూపిస్తాడోనని మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆతృతగా చూస్తున్నారు. అయితే ఎపి రోడ్లకు ఇది సూటవుతుందా లేదా అని అంటున్నారు.  

ఇక నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 19వ మూవీ బన్నీ చేస్తున్నాడు. ప్రధాన పాత్రదారులంతా షూటింగ్ లో బిజీగానే ఉన్నారు. హారికా ఆర్ట్ క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. టబు,సత్యరాజ్,సుశాంత్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.