Movies

మెగాస్టార్ తో రామానాయుడు ఒక్క సినిమాయే ఎందుకు చేసారో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో మూవీ మొఘల్ అనగానే డాక్టర్ డి రామానాయుడు గుర్తొస్తారు. దాదాపు అందరి హీరోలతో, అన్ని భాషా చిత్రాల హీరోలతో సినిమాలు చేసిన ఘనత ఆయనది. ఎందరో దర్శకులను,సాంకేతిక నిపుణులను,హీరోలను సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా పరిచయం చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అంటే కేవలం పెద్ద హీరోల సినిమాలు వరుసగా నిర్మించడం కాదని, మంచి సినిమాలను వరుసగా నిర్మించడం అని ఆయన చెప్పేవారు. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలని భావించలేదు.. ఏ సినిమా చేసినా కూడా మంచి విజయాన్ని దక్కించుకోవాలని చూశాడు.

అందుకే చిన్న స్టార్స్ తో సినిమాలు చేసినా కూడా సురేష్ ప్రొడక్షన్స్ కు ఎక్కువ సక్సెస్ లు దక్కాయి. 
ఇక ప్రస్తుతం రామానాయుడు కుమారుడు సురేష్ బాబు ప్రస్తుతం వరుసగా చిన్న చిత్రాలను నిర్మిస్తూ చిన్న సినిమాలకు పెద్ద దిక్కు అయ్యి వాటి పంపిణీకి సాయం కూడా చేస్తున్నాడు. అయితే ఆరోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో సురేష్ ప్రొడక్షన్స్ ఎక్కువ సినిమాలు నిర్మించలేదు. అందుకు కారణం ఏంటీ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబును ప్రశ్నించిన ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నాన్న గారు స్టార్స్ వెంట పడి డేట్లు తీసుకునే వారు కాదు. ఆయన అడిగితే ఎవరైనా డేట్లు కాదనకుండా ఇస్తామంటారు. కాని ఆరు నెలలు ఆగండి.

సంవత్సరం ఆగండి అంటే నాన్నకు నచ్చేది కాదు. అందుకే సక్సెస్ కంటిన్యూగా ఉన్న హీరోల వద్దకు నాన్న వెళ్లకుండా ఫెయిల్యూర్ తో ఉన్న వారి వెంట వెళ్లే వాడు. వారి డేట్లు తీసుకుని సినిమాలు నిర్మించి సక్సెస్ లు కొట్టేవారు’అని వివరించాడు. 

ఎన్టీఆర్ లాంటి వారు కూడా కాస్త ఆగు అంటే నాన్న ఆగకుండానే వరుసగా సినిమాలు నిర్మించే వాడు’అందుకే సురేష్ ప్రొడక్షన్స్ లో స్టార్స్ లేకుండానే వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే నాన్న గారి దారిలోనే నేను కూడా వెళ్తూ ఉన్నా. ఏదైనా పెద్ద సినిమా చేయాలనుకుంటే, పెద్ద హీరోకు చెందిన కథ ఉంటే తమ్ముడు వెంకటేష్ తో చేసే వాళ్లం’ అని సురేష్ బాబు వివరించాడు.