Movies

రాజమౌళి అఫర్ కి నో చెప్పిన బాలీవుడ్ భామ

బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీస్తున్న ఈ సినిమా జోరు ఏమాత్రం పెరగకుండా సాఫీగా షూటింగ్ జరుపుకొంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కు అలియా భట్ ను లాక్ చేసుకున్నాక తమ హీరోకు భామను ఎప్పుడు ప్రకటిస్తారా అని యంగ్ టైగర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. తారక్ కి జోడిని సెట్ చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే విదేశీ వనిత కావాలి. కానీ డైసీ హ్యాండ్ ఇవ్వడంతో ఆ స్థానాన్ని పేరున్న సెలబ్రిటీతో భర్తీ చేయాలని కుస్తీ పడుతున్నారు. 

దీంతో కథలో కీలక మార్పు చేసి ఆ పాత్రను భారతీయ యువతిగా మార్చినట్టు టాక్ కూడా నడుస్తోంది. సరే ఇదే బెటర్ అనుకుంటే ఇప్పుడా సెలక్షన్ కూడా క్రిటికల్ గా అయి కూర్చుందని అంటున్నారు. ముంబై టాక్ ప్రకారం శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని రాజమౌళి కలిసి ఆర్ ఆర్ ఆర్ లో పాత్రను ఆఫర్ చేశాడట. అయితే టాలీవుడ్ మొదటి సినిమా కాబట్టి తనకు వెయిట్ ఉండాలని కోరుకుంటున్నానని కానీ ఇందులో అంత స్కోప్ కనిపించడం లేదని అనేసి,తిరస్కరించిందట. ఇది నిజమో కాదో కానీ టాక్ మాత్రం గట్టిగానే నడుస్తోంది. 

ఇక బాహుబలి మూవీలో శ్రీదేవి కి శివగామి పాత్రకు ఆఫర్ ఇస్తే, రెమ్యునరేషన్ పరంగా నో చెప్పిందనే వార్త పెద్ద సంచలనంగా మారిపోయింది. అయితే ఆతరువాత శ్రీదేవి దాన్ని ఖండిస్తూ ప్రకటన కూడా జారీ చేశారు. ఇప్పుడు ఆవిడ లేదు కానీ ఇక్కడ చూస్తేనేమో జాన్వీ కపూర్ రాజమౌళి సినిమా వద్దనుకోవడం మాత్రం తెలివైన నిర్ణయం కాదేమోనని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. జాన్వీ ఇంకా స్టార్ గా ఎదగలేదు. చేసిందే ఒక్క సినిమా. ఇలాంటి పరిస్థితుల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ బంగారం లాంటి ఛాన్స్ వదులుకుంటే మంచిది కాదని కొందరు సినీ పెద్దలు అంటున్నారు.