Movies

నయన్ తార ఆశలన్నీ దానిపైనే …..హిట్ ట్రాక్ ఎక్కుతుందా…???

ప్రస్తుతం హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఎప్పటికప్పుడు కొత్త తారలు రావాల్సిందే. అయితే సినిమా పరిశ్రమలో దశాబ్దం పైగా టాప్ ర్యాంక్ లో వెలగడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో నయనతార తన ప్రత్యేకత చాటుకుంటోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో తననే కావాలని డిమాండ్ చేయడం ఆమె క్రేజ్ కి నిదర్శనం. అయితే గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన నయన్ కు ఈ సంవత్సరం అంతగా కల్సి రావడంలేదు. మొన్న సంక్రాంతికి చేసిన విశ్వాసం అజిత్ ఇమేజ్ పుణ్యమా అని కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం దాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. 

ఇక ఆ తర్వాత హారర్ జానర్ లో డిఫరెంట్ గా డ్యూయల్ రోల్ లో చేసిన ఐరా మూవీ దారుణంగా రెండు భాషల్లోనూ డిజాస్టర్ అయింది. ఆఖరికి అమెజాన్ ప్రైమ్ లో సైతం దాన్ని లైట్ తీసుకున్నారు. దాని తరువాత శివ కార్తికేయన్ తో చేసిన మిస్టర్ లోకల్ సైతం ఘోరంగా దెబ్బతింది. ఇలా దెబ్బకు తెలుగులో డబ్బింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఇక ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న నాలుగో సినిమా కొలైయుతీర్ కాలం కోర్టు చిక్కుల్లో పడి ఆగిపోయింది.

ఈ మూవీ హిందీ వెర్షన్ ఖామోష్ లో తమన్నా చేస్తే మూడు రోజులకె బాక్స్ ఆఫీస్ వద్ద ప్యాక్ అప్ అయిపోయింది. అందుకే ఈ సినిమా రిలీజైన నయన్ కు సైతం అదే రిజల్ట్ దక్కవచ్చ ని అంటున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవితో మొదటిసారి చేసిన సైరా సినిమా ఉంది. ఇది పెద్ద బ్రేక్ అవుతుందని చాలా నమ్మకంతో ఉంది. ఎలాగూ తమిళ్ కన్నడ వెర్షన్లు కూడా రిలీజవుతాయి కాబట్టి మళ్ళీ పుంజుకోవచ్చు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నయన్ కు ఆఫర్స్ వస్తున్నప్పటికీ సక్సెస్ కొడితే మళ్ళీ కెరీర్ ఊపుమీద ఉంటుంది. అందుకే సైరా హిట్ కోసం ఆమె ఎదురుచూస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."