మౌన రాగం సీరియల్ అమ్ములు తల్లి నీలవేణి గురించి మీకు తెలియని విషయాలు


తెలుగు బుల్లితెరపై నటీనటులు చేసే నటనకు ఆడియన్స్ నీరాజనం పడతారు. అందుకే సీరియల్స్ నటించడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇక మూగ అమ్మాయికి తల్లిగా, కోపిష్టి భర్తకు భార్యగా నటిస్తున్న శిరీష మంచి పేరు తెచ్చుకుంది. మౌనరాగం సీరియల్ లో అమ్ములు అమ్మగా నటిస్తున్న శిరీష అంటే చాలామంది గుర్తుపట్టేస్తారు. అందులో ఆమె పాత్ర పేరు నీలవేణి. 

నీలవేణి అసలుపేరు శిరీష ప్రవీణ్. మొదట్లో మోడలింగ్ చేస్తూ సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శిరీష తెలుగులో చెల్లెలి క్యారెక్టర్స్  కి సెలక్ట్ చేసేవారు. కాగా వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,అతడే ఒక సైన్యం, మనసంతా నువ్వే , పల్లకిలో పెళ్లికూతురు,ఒక్కడు వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్లో నటించింది. మాటీవీలో సుందర కాండ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మౌనరాగం సీరియల్ ఒప్పుకుంది, 

శిరీషకు ప్రవీణ్ అనే వ్యక్తితో పెళ్లయింది. ప్రవీణ్ బీఎంసీ కంప్యూటర్స్ లో చేస్తున్నాడు. ఎలాంటి అమ్మాయి కావాలని ప్రవీణ్ ని వాళ్ళ నాన్న అడిగారట. దాంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న శిరీష లాంటి అమ్మాయి కావాలని చెప్పాడట. ఇక ఒకరోజు వాళ్ళ పిన్నిగారింట హోమ్ మినిష్టర్ ప్రోగ్రాం జరిగిందట. అప్పుడు పిన్నిద్వారా శిరీషను ప్రవీణ్ పెళ్లిచేసుకున్నాడట. శిరీషను ముద్దుగా పూజ అని పిలుస్తాడట.