Devotional

పూరి దేవాలయం ఎక్కడ ఉంది? ఏ దేవుడు కొలువై ఉన్నారు?

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది.  సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన “ఛార్ థాం” పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.