Devotional

పూరి జగన్నాధుడుకి సంవత్సరంలో ఒక్కసారే అభిషేకం చేస్తారు….ఎందుకు….???

పూరి జగన్నాథుడికి ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. ఇందుకు గల కారణాలను తెలుసుకుందాం. పూరిజగన్నాథుడి ఆలయంలో మూలవిరాట్టుకు నిత్యం అభిషేకాలు ఉండవు. అయితే ప్రతి రోజు దర్పణస్నానం నిర్వహిస్తారు. అంటే మూల విరాట్టుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం 

అయితే ఏడాదికి ఒకసారి మాత్రం మూలవిరాట్టుతో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు. ప్రతి ఏడాది జేష్ట శుద్ధ పౌర్ణమిరోజున వీరికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు.నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అందుకే దేవతా మూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు.

అంటే స్వామివారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలు వాడుతారు. ఈ మూలికలు జలుబు, జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్హం. ఇక పదిహేను రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రల దర్శనం ప్రజలకు లభించదు.కేవలం స్వామివారి పటాన్ని మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా రథయాత్రకు ముందు రోజు చీకటి మందిరం నుంచి మూల వనరులను గర్భగుడిలోకి తీసుకువచ్చి మరలా పున:ప్రతిష్టిస్తారు. ఈ విధానం తరతరాలుగా జరుగుతూ ఉంది.