Movies

చరిత్ర చూపించబోతున్న 5 భారీ బడ్జెట్ చిత్రాలు

1. సైరా నరసింహారెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ సినిమా తెరకెక్కుతుంది. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో.. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కసరత్తులు చేస్తున్నాడు

2. ఆర్ఆర్ఆర్ 

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా చారిత్రక కధాంశంతో ముడిపడి తెరకెక్కుతున్న చిత్రమే. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.

3. హిరణ్యకశ్యప

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తెలియజేసాడు. అదే ‘హిరణ్యకశ్యప’. హీరో రానాతో ఈ పురాణ గాధను తెరకెక్కించనున్నాడు. గుణశేఖర్ చిత్రం అంటేనే కధకు తగ్గ సెట్టింగ్ లు, సాంకేతికతకు పెద్దపీట వేస్తారు. గుణశేఖర్ గత చిత్రాలతో పాటుగా ఈ చిత్రం కూడా గతాన్ని గుర్తుచేసేదే.

4. విరాటపర్వం

రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో సాగుతుంది. ఈ సినిమా కూడా చరిత్ర గుర్తుచేసేదే అని స్పష్టంగా తెలుస్తుంది.

5. జాన్ 

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ ఎంటర్టైనర్ కూడా కొన్ని దశాబ్దాల కిందటి కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఆ సినిమాకి ‘జాన్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది.