Politics

సీఎం జగన్ ప్రతి రోజు ధరించే తెల్ల షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా?

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్ దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారారు. అభివృద్ధి ధ్యేయంగా , సంక్షేమ పథకాలే ఊపిరిగా అధికారం చేపట్టిన జగన్ అవినీతి లేకుండా పాలన పారదర్శకంగా సాగాలని అధికారులకు,మంత్రులకు సూచిస్తున్నారు. అక్రమ నిర్మాణంగా భావిస్తూ, ప్రజావేదికను కూల్చి వేయించిన జగన్,కృష్ణా నది కరకట్టపై గల చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని ఉక్కుపాదం మోపారు.

అయితే జగన్ పర్సనల్ విషయానికి సంబంధించి పలు అంశాలు కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. ఇక తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మీటింగ్స్,ప్రజలను కలవడం వంటి వాటితో బిజీగా గల జగన్ ఫ్రెష్ గా కనిపించడం వెనుక సీక్రెట్ ఏమిటనే ప్రశ్న వస్తోంది. వరుస భేటీలతో అధికారులైనా అలసటగా కనిపిస్తున్నారేమో గానీ,జగన్ మాత్రం ఎక్కడా అలసట లేకుండా కనిపిస్తున్నారు. 

ఇక రాజకీయ నాయకులు ధరించే ఖద్దరు షర్ట్ కాకుండా జగన్ ధరించే వైట్ షర్ట్ గురించి చర్చ నడుస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు రంగుల షర్ట్స్ ధరించినప్పటికీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా తెల్లరంగు చొక్కా వేస్తున్నారు. తళతళా మెరుస్తూ ఫ్రెష్ గా కనిపించే షర్ట్ గురించి పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫేమస్ బ్రాండ్ పోలో రాయల్ ఫ్లయింగ్ అని అంటున్నారు. జగన్ సీఎం కాకముందు నుంచీ ఈ బ్రాండ్ అంటే జగన్ కి ఇష్టమట. హై క్వాలిటీ ఫాబ్రిక్ తో తయారయ్యే ఈ చొక్కాలకు జేబులుండవ్. మెరుపులు మెరుస్తూ కాస్టలీ చొక్కగా తెలుస్తుంది. అయితే ఈ బ్రాండ్ షర్ట్ ధర 8వేలనుంచి 12వేల వరకూ ఉంటుందట. కంఫర్ట్ గా ఉండే ఈ షర్ట్ కోసం జగన్ అక్షరాలా కనీసం 8వేలు వెచ్చిస్తున్నారని చెప్పవచ్చు.