Movies

చిరంజీవి టాప్ టెన్ మూవీస్….ఒక్కో సినిమా…. ఒక్కో అద్భుతం

చిన్న నటుడిగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరుకున్న చిరంజీవి డాన్స్ ,ఫైట్స్ తో అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్స్,బ్లాక్ బస్టర్స్ అతడి కెరీర్ లో నిలిచాయి. ఇక టాప్ టెన్ సినిమాలుగా చూస్తే,మెగాస్టార్ కి మొట్టమొదటి స్టార్ డమ్ తెచ్చిన మూవీ ఖైదీ అని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి కెరీర్ ఖైదీకి ముందు ఆతర్వాత అని అంటారు. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీతోనే చిరంజీవి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. రగులుతోంది మొగలి పొద సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పాలి. ఇక పసివాడి ప్రాణం మూవీ చిరుకి టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఈ మూవీలో చిరు నటన, పసివాడి నటన ఓ హైలెట్ అయితే ,మంచుకొండల్లో చిరంజీవి వేసిన స్టెప్స్ మరో హైలెట్ అని చెప్పాలి. మెగాస్టార్ డాన్స్ ల కోసమే సినిమాకు రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఫాన్స్ ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలీదు. ఓ పక్క మాస్ హీరోగా సాగిపోతున్న దశలో కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా చిరంజీవి లోని అసమాన నటనను వెలుగు చూసేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఓ స్టార్ హీరో చెప్పులు కొట్టుకునే పాత్రలో నటించడం స్టార్ ఇమేజ్ కి భిన్నంగా ఉండడం అప్పట్లో అందరిని షాక్ కి గురిచేసింది. ఇక ఆతర్వాత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ చిరు నటనకు అద్దం పట్టింది. మ్యూజికల్ హిట్ గా నిల్చి,అప్పటివరకూ చిరంజీవి సినిమాలకు గల మొత్తం రికార్డ్స్ ని ఇది అధిగమించింది. 

ఇక శ్రీదేవితో కల్సి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ సోషియో ఫాంటసీ చిత్రాల్లో క్లాసిక్ మూవీగా నిల్చింది. చిరు నటన, శ్రీదేవి అందం,అమ్రిష్ పురి విలనిజం,దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మార్క్ ఇవన్నీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఆతర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ ఫామిలీ ఆడియన్స్ కి చిరంజీవిని మరింత దగ్గర చేసిన మాస్ మూవీ. ఈ సినిమాలో చిరు నటన,డాన్స్ లు ప్రత్యేకత చాటాయి. ఇక ఘరానా మొగుడు సినిమా విషయానికి వస్తే,కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో పదికోట్లు సాధించిన తొలిచిత్రం కూడా ఇదే. తర్వాత గుణశేఖర్ ,మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎక్కువ హాల్స్ లో వంద రోజులు ఆడిన మూవీగా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. 20కోట్లు రాబట్టి పలు రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వినాయక్ దర్శకత్వంలో చేసిన ఖైదీ నెంబర్ మూవీ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ బంపర్ హిట్ కొట్టింది.