Movies

శ్రియా ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి రామ్ కుటుంబంతో సంబంధం ఏమిటి?

అనుకోకుండా కొందరు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే,కొందరు తమ డ్రీమ్ మేరకు ఏంటి ఇస్తారు. కొందరికి ఛాన్స్ లు వెతుకుంటూ వస్తాయి. ఇక స్టార్ హీరోయిన్ శ్రియాను కూడా ఇష్టం సినిమా లో ఏరికోరి హీరోయిన్ గా పెట్టుకున్నారు. 1982సెప్టెంబర్ 11న పుట్టిన ఈమె అసలు పేరు శ్రియా శరన్ భట్నాగర్. ఢిల్లీలోని కాలేజీలో చదువుతుండగా ఓ లెక్చరర్ బతిమాలాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో ఆమె నటించింది. ఇక ఆడియో రామోజీ బృందం కంటపడడంతో తాము తీసే ఇష్టం సినిమాలో పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అలా ఆమెకు పిలుపు రావడం, ఆమె వెంటనే హైదరాబాద్ రావడం సినిమాలో ఛాన్స్ కొట్టేయడం జరిగిపోయాయి. 

ఇష్టం మూవీ షూటింగ్ సమయంలోనే నువ్వే నువ్వే మూవీలో కొత్త హీరోయిన్ కోసం స్రవంతి రవికిశోర్ వెతుకుతున్నాడు. శ్రియాను చూసి హీరోయిన్ గా సెలక్ట్ చేసేసాడు. ఇష్టం విడుదల కాకముందే నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి, సంతోషం మూవీస్ పై సంతకాలు చేసింది. మూడు సినిమాలకు డేట్స్ ఎడ్జస్ట్ చేయడంలో స్రవంతి రవికిశోర్ ఆమెకు సాయం చేసారు. ఆవిధంగా టాప్ హీరోయిన్ గా శ్రియా వెలుగొందడానికి రవికోశోర్ దోహదపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే, సొంత తమ్ముడి కొడుకు రామ్ కి ఎలాంటి సలహాలు,భరోసా ఇస్తున్నారో శ్రియాకు కూడా అలాగే ఇస్తూ వచ్చారు. 

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో రామ్ సినిమాలో శ్రియా ఐటెం సాంగ్ చేసింది. రామ్ఫ్యామిలీ  చలవ వలెనే తాను ఇండస్ట్రీలో ఇలా ఉండగలిగానని శ్రియా అప్పట్లో చెప్పింది. అందుకే ఐటెం సాంగ్ చేయడంలో ఇబ్బంది లేదని చెప్పింది. అప్పట్లో రామ్ ఫ్యామిలీ తో అనుబంధం కారణంగా తరచూ వాళ్ళింటికి వెళ్లడం జరిగేది. ఇక శ్రియాకు మంచి మేనేజర్ ని కూడా రవికిశోర్ పెట్టారట. ఒక రష్యన్ ని ప్రేమించి పెళ్ళిచేసుకుని సెటిల్ అయింది. ఇక రామ్ బాధ్యతలను రవికిశోర్ చూస్తున్నారు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."