సినిమా రిలీజ్ కి ముందు ప్లాప్ అని తెలిసిన హిట్ అన్న హీరోల సినిమాలు
కథ వినేసి ఈ సినిమా హిట్ అవుతుందని భావించి ప్రొడ్యూస్ చేసాక అవి ప్లాప్ అయిన సినిమాలున్నాయి. ఇక మధ్యలోనే కథ మార్పు చేసి సినిమాలు పూర్తిచేసి చేతులు కాలుచుకున్న సినిమాలున్నాయి. కొన్ని మద్యలోనే ఆగిపోయిన మూవీస్ ఉన్నాయి. అంచానాకి ,వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంటుందని చాలా సినిమాలు నిరూపించాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల తన తల్లి ఇందిరా దేవి పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసారు. రొటీన్ కి భిన్నంగా డిఫరెంట్ గా మూవీ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో తమిళనాడు నుంచి ఎస్ జె సూర్య వచ్చి నాని సినిమా కథ వినిపించడంతో ఒకే చేసేసారు.
మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఎందుకో ఈ కథను ఇష్టపడలేదట. అయితే అసలు విషయం మంజులకు,మహేష్ కి తెలిసేసరికి 75శాతం సినిమా పూర్తయింది. కొన్ని మార్పులు చేసేసి పూర్తిచేసినా ఫలితం దక్కలేదు. ఇక మాస్ మారాజు రవితేజ నటించిన వీర మూవీ కూడా ఇదే తరహా అని చెప్పాలి. యానిమేటర్ ఐన రమేష్ వర్మ ఒక ఊరి మూవీతో డైరెక్టర్ గా మారాడు. వీర కథ చెబుతున్నప్పుడు నచ్చేసి రవితేజా ఒకే చేసాడు. సెట్స్ మీదికి వెళ్ళాక గందరగోళంగా మారింది. ఇక రిలీజ్ కి ముందే రవితేజ ఈ మూవీ పై ఆశలు వదిలేసుకున్నాడు. ఊహించినట్టే ఈ సినిమా ఘోరంగా దెబ్బతింది.
అలాగే కృష్ణ వంశీ తీసిన మొగుడు సినిమా కూడా ఇలాగే ప్లాప్ అయింది.
సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న వేవ్ కి పూర్తయ్యే సమయానికి చాలా తేడా వచ్చేసి, అసలు విషయం డైరెక్టర్ కి అర్ధం అయింది. ఇక మార్పులు , చేర్పులు చేస్తే,డబ్బు,కాలం వృధా అవుతుందని సినిమా పూర్తిచేసేసి విడుదల చేయగా ఘోరంగా ప్లాప్ అయింది. ఇక అదే తరహాలో నాగవల్లి మూవీపై చంద్రముఖి తరహాలో ఆశలు పెట్టుకున్న వెంకటేష్ కి నిరాశ మిగిలింది. డైరెక్టర్ ,కోట్లు ఖర్చుచేసిన ప్రొడ్యూసర్ సినిమా పూర్తికాకముందే ఆశలు వదులుకున్నారు. నాగార్జున భాయి సినిమా కూడా ఇలాగే డిజాస్టర్ అయింది. సునీల్ తో రామ్ గోపాల్ వర్మ తీసిన అప్పల్రాజు సినిమా కూడా ఇలాగే అంచనాలు తప్పాయి. ఇక నితిన్ నటించిన రెచ్చిపో మూవీ కూడా ప్లాప్ అయింది. ఇలియానాతో నటించడం కదా అని ఒకే చెప్పిన నితిన్ ఘోరంగా దెబ్బతిన్నాడు.

