Movies

గుర్తు పట్టకుండా ఉన్న ఇమే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?

తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ,సపోర్టింగ్ క్యారెక్టర్  గా నటించిన మౌనిక తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. మారుతీ రావు, గ్రేసీ దంపతులకు చెన్నైలో జన్మించిన మౌనిక మా అల్లుడు వెరీ గుడ్,కొడుకు,అరే సినిమాల్లో  హీరోయిన్ గా చేసిన ఈమె బాలనటిగా తెలుగు,తమిళం,మలయాళం సినిమాల్లో నటించింది. తెలుగులో చంటి మూవీతో సందడి చేసిన మౌనిక 2001లో తీర్ధ దానం అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అజగి అనే తమిళ సినిమాలో నటనకు ప్రశసంలు అందుకుంది. 

శివరామరాజు లో ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలుగా మౌనిక నటించింది. మా అల్లుడు వెరీ గుడ్ లో అల్లరి నరేష్ సరసన అదరగొట్టింది. తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళ,కన్నడ సినిమాల్లో కూడా కొన్నింటిలో నటించింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. 2014వరకూ ఆడియన్స్ ని అలరించిన ఈ అమ్మడు అదే ఏడాది మే30న హఠాత్తుగా ఇస్లాం మతం మార్చేసుకుంది. దీంతో ఎంజే రహీమాగా పేరు మార్చుకుంది. 

బాలనటిగా, హీరోయిన్ గా,సపోర్టింగ్ యాక్టర్ గా 24ఏళ్ళ సినీ కెరీర్ లో 70కి పైగా సినిమాల్లో నటించిన ఈమె మతం మారాక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. డబ్బు,పేరు కోసం కాకుండా ఇస్లాం మౌలిక సూత్రాలు నచ్చడంతో మతం మార్చుకున్నట్లు చెప్పింది. పేరెంట్స్ కూడా ఇందుకు కల్సి వచ్చారని,వారి పేర్లు కల్సి వచ్చేలా ఎంజే రహిమా గా మార్చుకున్నట్లు చెప్పింది. చెన్నైలోని గిండీలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం తన తండ్రి స్నేహితుడి కుమారుడు మాలిక్ అనే వ్యాపారవేత్తను 2015జనవరి 11న పెళ్లి చేసుకుంది. సంసారంలో మునిగిపోయింది.