Movies

తీన్మార్ సావిత్రికి v 6 ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా? యాంకర్ కాక ముందు ఏమి చేసేది?

వార్తలను సీరియస్ గానే చదవాల్సిన అవసరం లేదని సరదాగా కూడా చదవవచ్చని తీన్మార్ వార్తలు నిరూపించాయి. ఆ వార్తలకు అంతా ఫాలోయింగ్ రావటానికి కారణం సావిత్రి హావభావాలు కంఠ స్వరం అని చెప్పవచ్చు. v 6 ఛానల్ లో వచ్చే ఈ వార్తలు చదువు రాని వారికీ కూడా బాగా అర్ధం అవుతాయి. ఆలా సావిత్రి వార్తలను చదువుతుంది. ఆమె మాతృబాష తెలంగాణ యాసతో వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకుంటుంది సావిత్రి. సావిత్రి నిజామాబాద్ జిల్లా లో చిన్న గ్రామాల్లో పుట్టింది.

నాన్న RMP డాక్టర్. అమ్మ బీడీలు చుడుతుంది. సావిత్రి చిన్నప్పుడు అమ్మకు సాయంగా బీడీలు చుట్టేది. ఆమె ఇంటర్ మీడియట్ వరకు వారి ఊరిలోనే చదివింది. bsc నర్సింగ్ చేయటానికి హైదరాబాద్ యశోద కి వచ్చింది. అక్కడ సావిత్రికి చిన్న పిల్లల వార్డ్ లో వేయటంతో ఆమె అసలే ఇంజక్షన్ అంటే భయపడే సావిత్రి చిన్న పిలల్లకు ఇంజెక్షన్ చేయలేక మధ్యలోనే వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ప్రయివేట్ గా డిగ్రీ చదువుతుంది. v 6 ఛానల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం వెతుకుతున్నారని తెలిసి ఒక ప్రయత్నం చేద్దామని చేశాను. 

నా తెలంగాణ యాస నచ్చి అవకాశం ఇచ్చారు. కానీ నాకు వార్తలు చదవటం రాకపోవటంతో v 6 టీం నాకు చాలా సాయం చేసింది. ఎక్కడో వంద రూపాయిల కూలికి బ్రతకాల్సిన నన్ను ఈ పొజిషన్ కి తీసుకువచ్చింది మాత్రం v 6 ఛానల్ వారే. వారికీ ఎప్పటికి రుణపడి ఉంటునని అంటుంది సావిత్రి. ఆమెకు తల్లి తండ్రితో పాటు భర్త కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడని ఆనందమగా చెప్పుతుంది సావిత్రి. ఆమె చిన్ననాటి స్నేహితన్ని వివాహం చేసుకుంది. రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయని అంటుంది సావిత్రి.