BIGG BOSS 3 Tv 9 జాఫర్ రియల్ స్టోరీ
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఒకడైన టివి9జాఫర్ తనదైన శైలిలో జర్నలిజం మెళుకువలు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. రిపోర్టర్ గా టివి9లో అడుగుపెట్టి సీనియర్ రిపోర్టర్ గా ఎదిగి అనేక క్రైమ్ స్టోరీలు చేసాడు. ఏదైనా స్టోరీ చేయాలంటే ఆఫీస్ నుంచి కాల్ వచ్చేది. ఇన్ ఫుట్ డిపార్ట్ మెంట్ లో కీలక వ్యక్తి జాఫర్ అని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఎన్నో సంచలనాలకు మారుపేరుగా జాఫర్ నిలిచాడని చెప్పాలి.
విజయవాడ, విశాఖ తదితర చోట్ల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్స్ చేస్తూ,చివరకు ముంబై వెళ్లి అక్కడ సీక్రెట్ గా రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిల బాధలు ,ముఖ్యంగా తెలుగు అమ్మాయిల బాధల గురించి సమగ్ర కథనాలు అందించాడు. ఎంతో రిస్క్ తీసుకుని చేసిన ఈ విడియోలతోనే చాలా పాపులార్టీ సొంతం చేసుకున్నాడు. ఎన్నికల్లో రాజకీయ నేతలపై స్టోరీలు,సినిమా ప్రముఖులు,వివిధ రంగాల్లో ప్రముఖులు ఇలా అందరినీ ఇంటర్యూ చేసి, వారి వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. వారానికి ఒకసారి వచ్చే ముఖా ముఖీ ప్రశ్నల కోసం జనం ఎదురుచూసేవారు.వివాదాస్పద ప్రశ్నలతో ఇరుకున పెట్టడం వలన ఈ ప్రోగ్రాం కూడా వివాదాస్పదం అయింది.
ఆనం వివేకానంద రెడ్డి,రోజా, నటుడు సునీల్ ఇలా పలువురిని జాఫర్ అడిగిన ప్రశ్నలు వివాదంగా మారాయి. మీకు హీరో ఫీచర్స్ ఉన్నాయని ఫీలవుతున్నారా,అసలు అద్దంలో మీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నారా , హీరోగా మీరు ఫిట్ అని ఎప్పుడైనా అనిపించిందా ఇలా ప్రశ్నలు వేయడం పెద్ద దుమారం రేపింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితె చంపేస్తానంటూ సునీల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎందరో రాజకీయ నాయకులు ఇతడి ఇంటర్యూల వలన వీరంగం చేసి నష్టపోయారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులు,యువతపై సినిమా ప్రభావం వంటి ఎన్నో కొత్తకొత్త ప్రోగ్రామ్స్ తో మొత్తం మీద మీడియాలో జాఫర్ సక్సెస్ సాధించాడు. ఇక బిగ్ బాస్ లో ఎలాంటి టాస్క్ అయినా ఈజీగా చేస్తూ, విన్నర్ గా వస్తాడా లేదా అనేది చూడాలి.

