Movies

BIGG BOSS 3 రవికృష్ణ ఎవరి కొడుకు…. బిగ్ బాస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు

ప్రస్తుతం బిగ్ బాస్ త్రిలో కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్న నటుడు రవికృష్ణ బుల్లితెర ప్రభాస్ గా గుర్తింపు పొందాడు. ఎన్నో సీరియల్స్ లో తన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. విజయవాడకు చెందిన రవికృష్ణ 1983మార్చి 2న మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పటినుంచి నటనపై అమితాసక్తి గల రవి కృష్ణ స్కూల్ లో జరిగే ఫంక్షన్స్ లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడు. ప్రశంసలు పొందేవాడు.

ఇక డిగ్రీ అయ్యాక నటనవైపు తనకున్న ఆసక్తిని తండ్రికి చెప్పడం ఆయన ఒప్పుకోకపోయినా మేనమామ ఎంకరేజ్ మెంట్ తో నటనవైపు అడుగుపెట్టాడు. చెన్నై వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన రవికృష్ణ ఈటీవీలో ప్రసారమైన విజయం అనే సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. బొమ్మరిల్లు సీరియల్ లో 13ఎపిసోడ్స్ లో నటించాడు. హీరోగా ట్రై చేయమని కొందరు చెప్పడంతో అప్పుడే మొదలైన మొగలి రేకులు సీరియల్ కి ఆడిషన్స్ జరగడంతో చిన్న పాత్ర వచ్చినా చాలని వెళ్ళాడు. 

అయితే అక్కడికి వచ్చిన 800మందిలో రవికృష్ణ ఎంపికయ్యాడు. అలా రెండేళ్లు అందులో నటించాడు. ఇక జి తెలుగులో ప్రసారం అయిన వరూధిని పరిణయం సీరియల్ లో రవికృష్ణ నటనకు బుల్లితెర ఆడియన్స్ నీరాజనం పట్టారు. విపరీతంగా ఈ సీరియల్ ని ఆదరించారు. ఇక ఆతర్వాత ఎన్నో ఛాన్స్ లు వచ్చాయి. మాటీవీలో శ్రీనివాస కల్యాణంలో ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఈటీవీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న మనసు మమత సీరియల్ లో  నటించే ఛాన్స్ వచ్చింది. పైగా డ్యూయల్ రోల్ కూడా ఇచ్చారు. అప్పటికే సూపర్ హిట్ గా నిల్చిన ఈ సీరియల్ రవికి మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం మూడు సీరియల్స్ లో నటిస్తూ అన్నింటిని పక్కన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి టైటిల్ గెలుస్తాడా లేదా చూడాలి. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."